ఫార్ములా వన్ కంటే స్పీడ్.. బటిస్టాను చూసి మురిసిపోయిన మహీంద్రా

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒక్కటైన మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వినియోగదారులకు అవసరమైన విద్యుత్ వాహనాల తయారీలో ముందు నిలిచింది. తాజాగా జెనీవా ఆటో షోలో ఆవిష్కరించిన ‘బటిస్టా’ రెండు సెకన్లలో 62 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. బటిస్టాను తయారు చేసిన ఫినిన్ పారినా సంస్థను 2015లో మహీంద్రా కొనుగోలు చేసింది. బటిస్టా కారు ‘ఫార్ములా వన్’ రేసు కారు కంటే వేగంగా ప్రయాణిస్తుంది

Mahindra unveils world's 'fastest' e-car Battista at Geneva Motor Show

ప్రపంచంలోనే వేగవంతమైన విద్యుత్‌ కారు ‘బటిస్టా’ను మహీంద్రా గ్రూప్‌ అనుబంధ ఆటోమొబిల్‌ పినిన్‌ఫారినా ఆవిష్కరించింది. జెనీవా ఆటో షోలో ప్రదర్శించింది. వచ్చే ఏడాది ఈ కారును విపణిలోకి తేవడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇటలీలో ఈ కారును డిజైన్‌, అభివృద్ధి చేసినట్లు పినిన్‌ఫారినా తెలిపింది. 2015లో మహీంద్రా..ఈ పినిన్ఫారినను 50 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

బటిస్టా కేవలం రెండు సెకండ్లలో 62 మైళ్ల వేగాన్ని అందుకోనున్నది. ఇది ఫార్ములా వన్ రేసింగ్‌ కారు కంటే బటిస్టా శక్తివంతమైందని, 250 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ప్రస్తుతం లభిస్తున్న ఫార్ములా 1 కారు కంటే అత్యధిక వేగం.కేవలం 150 బటిస్టా కార్లను మాత్రమే తయారుచేస్తామని, ఉత్తర అమెరికా, ఐరోపా, మధ్యప్రాచ్య, ఆసియా విపణులకు సమానంగా పంపిస్తామని వివరించింది. పినిన్‌ఫారినా లగ్గరీ విద్యుత్‌ వాహనాలను విక్రయిస్తుంది.

ఫినిన్‌ఫారినా సీఈఓ మైఖెల్ పర్చేక్ మాట్లాడుతూ ‘బటిస్టా’ పనితీరు నమ్మలేని విధంగా ఉంటుందన్నారు. ‘కల నిజమైంది. ఇది భవిష్యత్ తరం హైపర్‌ కారు. ఆటోమోటివ్‌ చరిత్రలో దీనిపేరు నిలిచిపోయేలా తయారు చేశాం’అని తెలిపారు. కేవలం బటిస్టా కార్లకు సర్వీస్‌ను లాస్‌ఏంజెల్స్‌, టోక్యో, లండన్‌ నగరాల్లోని అత్యుత్తమ ఆటోమొబైల్‌ నిపుణులు అందజేస్తారు. 

బాట్టిస్టా ఆవిష్కరణ అంశాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నమహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా మురిసిపోయారు. బాట్టిస్టా తయారీని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపారు. దీనిపై ఒక వీడియోను ట్విట్టర్‌లో ఆనంద్‌ మహీంద్రా పోస్ట్ చేసి బాట్టిస్టా అందాన్ని ప్రశాంతంగా ఆస్వాదించండి అని క్యాప్షన్‌ ఇచ్చారు. 
మహీంద్రా అభిమాని ఒకరు ‘సర్‌, ఎంత ఇస్తుంది?’(మైలేజీకి సంబంధించి) అని ప్రశ్నించారు. ఈ ట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. సర్‌జీ, కరెంట్‌ ది.. షాక్‌ ఇస్తుంది!’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు మహీంద్రా అభిమానులు సరదాగా కామెంట్లు పెడతారు.ఒకసారి ఛార్జ్‌ చేస్తే 300 మైళ్లు ఏకధాటిగా ప్రయాణిస్తుంది.

ఈవీలపై ప్రత్యేక దృష్టి: గోయెంకా
దీర్ఘకాలికంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఉంటుందన్న అంచనాతో ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా తెలిపారు. ఇందుకోసం ఫోర్డ్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. తద్వారా నూతన కార్ల అభివృద్ధికి వీలుంటుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికే ఈ-వెరిటో కారును విక్రయిస్తుండగా, మరో ఆరు నెలల్లో ఈ-కేయూవీని, ఏడాదిలోగా ఎక్స్‌యూవీ300ని కూడా లాంచ్ చేస్తామన్నారు. ఫోర్డ్‌తో కలిసి తయారు చేయనున్న కార్లలో ఒకటి కాంప్యాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కాగా, ఇతర కార్లు మరో ప్లాట్‌ఫామ్ కింద తయారు చేయనున్నట్లు చెప్పారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios