మార్కెట్ లోకి మారుతి న్యూ `వాగన్‌ ఆర్’

First Published 7, Oct 2018, 11:42 AM IST
Maruti Suzuki WagonR Limited Edition Introduced
Highlights

పండుగల వేళ వినియోగదారులకు దగ్గరయ్యేందుకు దేశీయ ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మారుతి సుజుకి తాజాగా అప్‌డేట్‌ చేసిన వాగన్‌ ఆర్‌ మోడల్ కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. తాజాగా అప్‌డేట్‌ చేసిన ఈ మారుతి సుజుకి వాగన్‌ ఆర్ ధర రూ 4.19 లక్షల నుంచి రూ. 5.39 లక్షలు పలుకుతోంది.

ఫెస్టివల్‌ సీజన్లో వినియోగదారులకు చేరువయ్యేందుకు దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. ఎక్కువగా అమ్ముడయ్యే మోడల్‌ కార్లలో ఒకటైన ‘వ్యాగన్ ఆర్’కు కొత్త సొబగులద్ది మరీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మోడల్‌ కొనుగోలు దారులకు మారుతిసుజుకి యాజమాన్యం రెండు ఆప్షనల్ యాక్ససరీస్ను కూడా ఆఫర్ చేస్తోంది.

ఈ కిట్లు రూ.15,490, రూ.25,490 ప్రత్యేక ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్లో ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, డబుల్-డిన్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్తోపాటు  రివర్స్ పార్కింగ్ సెన్సార్లను, ఫాబ్రిక్ ఫ్లోర్ మాట్స్ను  జోడించింది.

డబుల్ డిన్  బ్లూటూత్  మ్యూజిక్ సిస్టమ్ విత్ స్పీకర్స్ అమర్చింది. అలాగే  సీటు కవర్ల డిజైన్ను కూడా కొత్తగా తీర్చిదిద్దింది.  ఇక ఎక్స్ టీరియర్ విషయానికి వస్తే బాడీ గ్రాఫిక్స్తో పాటు, వెనుక స్పాయిలర్ను అమర్చింది. ఈ పరిమిత ఎడిషన్లో జోడించిన అదనపు హంగులతో వినియోగదారులను భారీగా ఆకర్షించాలని మారుతి భావిస్తోంది. వ్యాగన్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ ద్వారా  కస్టమర్లకు ఈ పండుగు సీజన్ మరింత అద్భుతంగా మారనుందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ ఒక ప్రకటనలో తెలిపారు. 

కాగా 1999లో మార్కెట్‌లో ప్రవేశించిన వాగన్ ఆర్  మారుతి సుజుకి అమ్మకాల్లో  కీలక పాత్రను పోషిస్తోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో  మారుతి మొత్తం అమ్మకాల సంఖ్య 21.9 లక్షలు నమోదుకాగా, వ్యాగన్ ఆర్ 85వేల యూనిట్లు విక్రయించడం గమనార్హం..

తాజాగా అప్‌డేట్‌ చేసిన ఈ మారుతి సుజుకి వాగన్‌ ఆర్ ధర రూ 4.19 లక్షల నుంచి రూ. 5.39 లక్షలు పలుకుతోంది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడిన 1.0 లీటర్, 3-సిలిండర్ డ్యూయల్ ఇంజిన్ (పెట్రోల్, సీఎన్జీ) ఆప్షన్సతో  లభిస్తుంది. అలాగే  5-స్పీడ్ ఎఎంటీ ట్రాన్స్మిషన్తో పెట్రోల్ వెర్షన్లోనూ ఈ కారు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 

loader