తెలంగాణ బీజీపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేయడంతో కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమ్మేయాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది.
బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ తెలిపింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగేందుకు సిద్దమైన సత్యనారాయణ ముదిరాజ్ పోటీ నుంచి తప్పుకున్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మొదటగా సంబంధం లేదని సజ్జల చెప్పారని, ఇప్పుడు ఏం సంబంధం ఉందని తన గురించి మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం కొనసాగుతుంది. హమాస్ గ్రూప్ నెట్‌వర్క్‌ను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ముందుకు సాగుతుంది.
ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) హీరాలాల్ సమరియా నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల యుగం రాబోతోందని అన్నారు.