బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా తీవ్రత..
బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది.
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌సీఎస్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
ఇక, నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. నేపాల్‌లో సోమవారం సాయంత్రం రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ప్రభావంతో ఢిల్లీలో కూడా ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ) తెలిపింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలు కొన్ని సెకన్ల పాటు స్వల్ప ప్రకంపనలకు లోనయ్యాయని పేర్కొంది.