ఓటు వేయకుండానే పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన సీఎం జోరంతంగా.. ఎందుకంటే..

మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది.

Mizoram CM Zoramthanga Postpones To Vote In EVM Malfunction ksm

మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం చేరుకున్న మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగాకు చేదు అనుభవం ఎదురైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనిచేయకపోవడంతో అయితే తన ఓటు వేయలేకపోయారు. అయితే ఆయన మధ్యాహ్నం ఓటు వేసేందుకు తిరిగి పోలింగ్‌బూత్‌కు రానున్నట్టుగా తెలుస్తోంది. 

వివరాలు..  పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జోరమ్‌తంగా మాట్లాడుతూ..మిజోరంలో హంగ్ అసెంబ్లీ ఉండదని..  తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తనకు పూర్తి విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు కావాలని.. అయితే తమకు 25 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని మేము ఆశిస్తున్నామని తెలిపారు. 

కేంద్రంలో ఎన్డీయేలో ఎంఎన్‌ఎఫ్ భాగమైనప్పటికీ..  రాష్ట్రంలో ఎంఎన్‌ఎఫ్ కూటమికి బీజేపీ భాగస్వామి కాదని జోరమ్‌తంగా అన్నారు. ‘‘రాష్ట్రంలో బీజేపీతో కానీ మరే ఇతర పార్టీతో కానీ పొత్తులు లేవు.. ఇప్పటివరకు వాళ్లు మమ్మల్ని సంప్రదించలేదు.. మేం వాళ్లను సంప్రదించలేదు.. మేము కేంద్రంలో ఎన్‌డీఏ భాగస్వామి మాత్రమే, ఇక్కడ రాష్ట్రంలో మేము సమస్యల ఆధారితంగా కూడా ఎన్‌డీఏకు మద్దతు ఇస్తున్నాము’’ అని ఆయన చెప్పారు. 


మిజోరాం అసెంబ్లీకి మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది.  డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిజోరం రాష్ట్ర ఎన్నికల అధికారుల ప్రకారం.. మిజోరంలో మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895.. వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు. మిజోరంలో మొత్తం 4,973 సర్వీస్ ఓటర్లు ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios