Asianet News TeluguAsianet News Telugu

సంతానం కలగాలంటే ఏ వ్రతం చేయాలి.?

ఈ వ్రతం శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. ఇల్లంతా అలంకరించుకోవాలి. ఒక కందమొక్కను పూజచేసే చోట ఉంచి, తోరాలను పోసి ముందుగా వినాయకుడికి పూజ చేసి తరువాత మంగళగౌరీదేవి గాని సంతాన లక్ష్మీదేవిని గాని ఆహాన చేసి షోడశోపచారాలతో పూజ చేసి తొమ్మిది పూర్ణం బూరలను నైవేద్యంగా సమర్పించాలి. సంతానం కలిగిన ఒక ముత్తైదువును పూజించి సువాసినీ పూజ చేసి, నైవేద్యం పెట్టకుండా ఉంచిన బూరలను ఆమెకు వాయనంగా ఇవ్వాలి. తర్వాత తోరాన్ని కందమొక్కకు క్టి మిగతావి పిల్లల చేతికి కట్టాలి. ఇలా చేయడం వలన సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలుగొందుతారు.

Powerful Mantra for santanam
Author
Hyderabad, First Published Aug 28, 2019, 1:54 PM IST

30.8.2019న పొలాల అమావాస్య. ఈ అమావాస్యను ఎందుకు జరుపుకుంటారు? సంతానం కలుగక బాధపడుతున్న వారికోసం ఈ వ్రతం చేస్తారు. వ్రతాలు, నోములు అనేవి కేవలం స్త్రీలకు మాత్రమే నిర్దేశించబడినవి. ఎందుకనగా స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాలకోసం వ్రతాలు ఓపికగా ఆచరిస్తారు. పురుషులకు అంత వోపిక, నెమ్మదితనం ఉండవు. ఒక్కో వ్రతం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకున్నది.

శ్రావణమాసంలో వచ్చే మంగళగౌరీలు సౌభాగ్యం కోసం చేసే వ్రతాలు అయితే ఈ పొలాల అమావాస్య వ్రతం అనేది ప్రత్యేకంగా సంతాన రక్షణకోసం చేయబడినది. పెళ్ళి అయి చాలా కాలం సంతానం కలుగని స్త్రీలు, సంతానం ఉన్నవారు కూడా ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి.

ఈ వ్రతం శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. ఇల్లంతా అలంకరించుకోవాలి. ఒక కందమొక్కను పూజచేసే చోట ఉంచి, తోరాలను పోసి ముందుగా వినాయకుడికి పూజ చేసి తరువాత మంగళగౌరీదేవి గాని సంతాన లక్ష్మీదేవిని గాని ఆహాన చేసి షోడశోపచారాలతో పూజ చేసి తొమ్మిది పూర్ణం బూరలను నైవేద్యంగా సమర్పించాలి.

సంతానం కలిగిన ఒక ముత్తైదువును పూజించి సువాసినీ పూజ చేసి, నైవేద్యం పెట్టకుండా ఉంచిన బూరలను ఆమెకు వాయనంగా ఇవ్వాలి. తర్వాత తోరాన్ని కందమొక్కకు క్టి మిగతావి పిల్లల చేతికి కట్టాలి. ఇలా చేయడం వలన సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలుగొందుతారు.

నైవేద్యం కాని వాయనం కాని పూర్ణం బూరెలు మాత్రమే ఎందుకు? పూర్ణం బూరె పూర్ణ గర్భానికి సంకేతం. పూర్ణం గర్భస్థ శిశువుకు సంకేతం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది. కనుక పూర్ణం బూరెలను నైవేద్యంనివేదన చేసి, అవే వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు. కనుక మాతృత్వాన్ని కోరుకునే స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి.

కథ : పూర్వం పిల్లమఱ్ఱి అనే గ్రామంలో ఒక పండితుడు ఉండేవాడు. అతనికి 7గురు మగ సంతానం. అందరికీ వివాహంఅయి అందరికీ సంతానం కలిగింది. చివరి కొడుకుకి మాత్రం సంతానం పుట్టడం వెంటనే చనిపోవడం జరిగేది. ఇలా ఆరుసార్లు జరిగింది. ఇలా ఆరు సంవత్సరాలు పొలాల అమావాస్యరోజే జరగడం వలన ఎవరూ ఈ నోము నోచుకునే అవకాశం కలుగలేదు.

మిగతావారందరూ ఆమెను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవారు. 7వ సం|| కూడా తిరిగి గర్భవతి అయితే ఆవిడను పిలవకుండా వ్రతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదేరోజు ఈవిడ మృత శిశువుకు జన్మ నిచ్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. తోటికోడళ్ళతో తను కూడా వ్రతం చేసుకున్నది. తిరిగి ఇంటికి వచ్చి ఆ మృత శిశువును స్మశానికి తీసుకుపోయి పిల్లల సమాధివద్ద ఏడుస్తూ కూర్చున్నది.

బాగా చీకి పడిన తర్వాత అమ్మవారు కనిపించి విషయం తెలుసుకొని కథ చెప్పిన అక్షితలు నీళ్ళు వాళ్ళపై చల్లి పేరు పేరునా పిలువు అని చెప్పి అంతర్ధానమైంది. ఆ అమ్మాయి ఆ పని చేయగా అందరూ నిద్రపోయినవారివలె లేచి కూర్చున్నారు. గతంలో ఈ వ్రతం చేయలేదు కనుక ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. ఇంక ఎప్పుడూ నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పి అంతర్ధానమైంది. అందరూ కలకాలం సంతోషంగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios