1. పాండురంగ రామారావు

ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?

ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదు. దసరా తర్వాత నుంచి అవకాశాలు వస్తాయి. మీకు ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు తక్కువ. ప్రభుత్వరంగ సంస్థల్లో (బాంకులు మొదలైనవాటిలో) ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటికి మీరు ప్రయత్నం చేయవచ్చు. మీరు నిరంతరం జపం దానం తప్పనిసరి.

శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవాలి.

దానం : 1. గోధుమరవ్వ/ చపాతీలు, 2. నూనె, వండుకునేవారికి వంటకు, దేవాలయంలో దీపారాధనకు; దానం చేయాలి.

2. బి.వి.సత్యనారాయణ

ఉద్యోగం మరియు భవిష్యత్తుల ఎలా ఉంటుంది.

మీకు భవిష్యత్తు చాలా అనుకూలంగా బావుంటుంది. ఉద్యోగం వస్తుంది. జీవితంలో మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అకాశం ఉంటుంది. లోటుపాట్లు లేవు. మంచి వృత్తిలోనే శ్రమపడుతూ జీవితం కొనసాగించాలి. వ్యాపారం చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. కాని 25 ఫిబ్రవరి 2019 నుంచి 3 సం|| వరకు రాహు మహాథ ఉంటున్న కారణాన శ్రమ ఎక్కువ ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఊహలు అపోహలయ్యే అవకాశం ఉంటుంది. తొందరపాటుతో అనాలోచితంగా ఎటువిం పెట్టుబడులు పెట్టకూడదు. ఈ మూడు సంవత్సరాలు ఉద్యోగం మాత్రమే చేసుకోవాలి. జపం దానాలు నిరంతరం చేసుకోవాలి.

శ్రీమాత్రే నమః జపం, దుర్గాసంబంధ శ్లోకాలు, పూజలు చేసుకోవడం, చేయించుకోవడం మంచిది.

దానాలు : 1. ఇడ్లీ, వడ/ 2. పశుపక్షాదులకు ఆహారం జీవితాంతం చేయాలి. ఎప్పుడూ మానకూడదు.

3. గజేంద్రనాయుడు

4.9.2019 నుండి 27.12.2020 సమయం వివాహానికి అత్యంత అనుకూలమైనది. అప్పివరకు వివాహ ప్రయత్నాలు చేయరాదు. ఈ సమయంలో జపం, దానాలు చేసుకుంటూ ప్రయత్నాలు చేస్తే వెంటనే తప్పకుండా కుదురుతుంది. జపం దానాలు ఎక్కువగా చేయాలి. లేకపోతే వచ్చిన మంచి సమయం చే జారిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి.

జపం :    కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

ఈ జపాన్ని వీరు కనీసం సెప్టెంబరు లోపు 5 లక్షలు పారాయణం చేయాలి. శివాభిషేకం, సుబ్రహ్మణ్యారాధన, హనుమంతుని పూజ రెగ్యులర్‌గా చేసుకోవాలి.

దానం : 1. కందిపప్పు / దానిమ్మపళ్ళు / కర్జూరం, 2. నూనె, వండుకునేవారికి వంటకు, దేవాలయంలో దీపారాధనకు దానం చేయాలి.

4. రేఖ

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

జీవితంలో మంచి, ఉద్యోగం వ్యవహారం అన్నీ ఉన్నా కూడా 3.4.2019 నుంచి 4.3.2020 వరకు అన్ని విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి అవసరం. ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. నిత్య జీవితంతో అన్ని వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సౌఖ్యలోపం ఉంటుంది.

జపం : శ్రీమాత్రేనమః, శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

దానం : కందిపప్పు, దానిమ్మపళ్ళు, కర్జూరాలు, ఎరుపు వస్త్రాలు దానం చేయడం తప్పనిసరి. ఇవి దానాలు జపం చేసుకోవడం ద్వారా దోష ప్రభావం తగ్గుతుంది.

5. అనూష

విదేశీయానం ఉంటుందా?

విదేశీయాలను జాతకంలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 1 సం|| పాటు కొంత అవకాశం ఉన్నప్పికీ శ్రమ, కాలం, ధనం ఎక్కువ వ్యర్థం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2023 మార్చ్‌ వరకు అన్ని విషయాలు శ్రమతో కూడి ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. అతి ఆత్మవిశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు అధికం ఉంటాయి. దీనివల్ల లోకసంబంధాలు, వైవాహిక అనుబంధాలు, స్నేహ బంధాల్లో ఇబ్బందులకు అవకాశం. అనుక్షణం దైవధ్యానం చేయడం ద్వారా మాత్రమే ఈ అనాలోచిత తత్త్వం నుంచి దూరం జరిగే అవకాశం ఉంటుంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఒకరిని సంప్రదించి తరువాత మాత్రమే తీసుకోవాలి.

దానాలు : 1. కందిపప్పు, దానిమ్మపళ్ళు, కర్జూరం దానం చేయాలి. ఇవి జీవితకాలం దానాలు చేయాలి.

శ్రీరామ జయరామ జయజయ రామరామ, 2. హరహర శంకర, జయజయ శంకర జపం చేసుకోవాలి. ఈ జపాలను అనుక్షణం పారాయణం చేస్తూ ఉండాలి.

ముమ్మిడి తిరుపతిచారి పూర్తి వివరాలు పంపలేదు. అదేవిధంగా.. పూర్తి జాతకం పంపడానికి ఇది సరైన వేదిక కాదు. కాబట్టి ప్రస్తుతం మీకు ఉన్న జాతక సమస్యలు మాత్రమే అడగండి.

డా.ఎస్.ప్రతిభ