అమరావతి: ముగ్గురు ఐపీఎస్ అధికారులను సీఈసీ బదిలీ చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఉద్దేశ్యపూర్వకంగా వైసీపీ నేతలు ఇచ్చిన పిర్యాదు ఆధారంగా సీఈసీ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయాలని బాబు ప్రభుత్వం భావిస్తోంది. మరో వైపు ఇదే విషయమై  హైకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం నాడు కొట్టివేసిన విషయం తెలిసిందే.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ,  ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావులను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ సీఈసీ మంగళవారం నాడు రాత్రి ఆదేశాలు జారీ చేసింది. 

ఈ బదిలీలను నిరసిస్తూ బుధవారం నాడు  నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలను విన్న ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు తన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఏపీ సర్కార్ వాదనతో ఏకీభవించలేమని కోర్టు తేల్చి చెప్పింది.

దీంతో ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ సర్కార్ యోచిస్తున్నట్టుగా సమాచారం. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఒంటిగంటకు సీఈసీ సునీల్ ఆరోరాను టీడీపీ ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో కలవనున్నారు. ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో వైసీపీ తప్పుడు ఫిర్యాదు చేసిందని టీడీపీ ప్రతినిధి బృందం వివరించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

ఐపీఎస్‌ల బదిలీ: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టులోషాక్

ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో రేపు వాదనలు

కీలక జీవోను జారీ చేసిన చంద్రబాబు సర్కార్:ఇంటలిజెన్స్‌కి మినహాయింపు

మేమే చెప్పాం, అందుకే ఇంటలిజెన్స్ డీజీ బదిలీ: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్