సత్తెనపల్లి: చట్ట వ్యతిరేకమైన ఈసీ నిర్ణయాలు బాధ కల్గిస్తున్నాయని సత్తెనపల్లి నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఇంటలిజెన్స్ చీఫ్ ఈసీ పరిధిలోకి రాడని ఆయన చెప్పారు.

బుధవారం నాడు ఆయన సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారని ఆయన ఆరోపించారు.  ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా గాంధీకి ఏమైందో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. 

వైసీపీ నేరచరిత్ర గల పార్టీ అని కోడెల ఆరోపణలు చేశారు. 13 కేసుల్లో ముద్దాయిని కాపాడేందుకు మోడీకి ఎందుకు శ్రద్ధ పెడుతున్నారో చెప్పాలని ఆయన కోరారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  ఎలా జరిగిందో అందరికీ తెలుసునన్నారు. జగన్‌కు తెలియకుండా ఏమీ జరగదన్నారు. అందుకే కడప ఎస్పీని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు.  ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోరుకొంటుందన్నారు.

సంబంధిత వార్తలు

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్