కర్నూల్: ఆర్ధిక నేరస్తుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తారా అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

బుధవారం నాడు ఆయన కర్నూల్‌లో మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే  విచారణ లేకుండా చర్యలు తీసుకొంటారా  అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  ఏ కారణం లేకుండానే  అధికారులను బదిలీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. 

బీజేపీ, వైసీపీ, కేసీఆర్ నాటకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.అధికారులను ఏ కారణంతో బదిలీ చేశారో సమాధానం చెప్పలేకపోతున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు.

సంబంధిత వార్తలు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్