Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎస్‌ల బదిలీ: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టులోషాక్

ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో  హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.  ఐపీఎస్ అధికారుల బదిలీలను నిలిపివేయాలని  ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది

high court quash the petition of AP government
Author
Amaravathi, First Published Mar 29, 2019, 10:51 AM IST

ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో  హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.  ఐపీఎస్ అధికారుల బదిలీలను నిలిపివేయాలని  ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది

ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలపై ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ బదిలీలపై సీఈసీ ఆదేశాల్లో  తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు స్పష్టం చేసింది. నో కేస్ ఫర్ ఇంటెరిమ్ రిలీఫ్ అని ఆదేశాలిచ్చిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ఏపీ సర్కార్‌పై వైసీపీ, ఈసీ చేసిన వాదనలకు బలం చేకూరినట్టైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను మంగళవారం నాడు రాత్రి సీఈసీ బదిలీ చేసింది. ఈ బదిలీలను నిరసిస్తూ బుధవారం నాడు  ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై గురువారం నాడు ఇరు వర్గాలు వాదనలను విన్పించారు. మద్రాసు, హైకోర్టు తీర్పులను ఏపీ ప్రభుత్వం గురువారం నాడు  హైకోర్టులో ప్రస్తావించారు. ఆలిండియా సర్వీస్ అధికారులపై చర్యలు సరికావని ఏపీ సర్కార్ ప్రస్తావించింది.

ప్రజా ప్రాతినిథ్య చట్టం పరిధిలోకి రాని అధికారులపై ఈసీ చర్యలను ఏపీ సర్కార్ తప్పుబట్టింది.నాలుగు గంటల పాటు ఈ విషయమై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్, వైసీపీ తరపున సీవీ మోహన్ రెడ్డి,  ఈసీ తరపున ప్రకాష్ రెడ్డి వాదనలను విన్పించారు.

ఐపీఎస్ ల బదిలీల విషయంలో ప్రభుత్వం చేస్తున్న వాదనపై ఏపీ సర్కార్ వితండవాదం చేస్తోందని ఈసీ తరపు న్యాయవాది ప్రకాస్ రెడ్డి కోర్టులో వాదించారు. ఐపీఎస్‌ల అధికారులను ఎన్నికల సమయంలో బదిలీ చేయడం ఆనవాయితీగా వస్తోందని  ఆయన ప్రశ్నించారు.

ఇంటలిజెన్స్ డీజీ  విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతోందో చెప్పాలని  ఈసీ, వైసీపీ తరుపున న్యాయవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  గురువారం నాడు ఈ విషయమై తీర్పును కోర్టులో రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో రేపు వాదనలు

కీలక జీవోను జారీ చేసిన చంద్రబాబు సర్కార్:ఇంటలిజెన్స్‌కి మినహాయింపు

మేమే చెప్పాం, అందుకే ఇంటలిజెన్స్ డీజీ బదిలీ: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్

Follow Us:
Download App:
  • android
  • ios