అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు కీలకమైన జీవోను  జారీ చేసింది. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న డీజీపీ సహా కానిస్టేబుల్ స్థాయి  అధికారులను సీఈసీ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బుధవారం నాడు మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం ఈ  జీవోను జారీ చేసింది.  మంగళవారం రాత్రి ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను బదిలీ చేస్తూ సీఈసీ  నిర్ణయం తీసుకొంది.

అయితే ఎన్నికలకు సంబంధం లేని ఇంటలిజెన్స్ డీజీని కూడ బదిలీ చేయడంపై ఏపీ సర్కార్ తప్పుబడుతోంది. మరోవైపు కనీసం నోటీసులు ఇవ్వకుండానే ఎస్పీలను బదిలీ చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

సీఈసీ తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఏపీ సర్కార్. ఈ విషయమై హైకోర్టులో సీఈసీ తీరుపై తమ వాదనలను విన్పించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఎన్నికల విధులతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క పోలీసును సీఈసీ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.సీఈసీ నిబంధనల మేరకే అనిల్ పునేఠా ఈ ఉత్తర్వులు వెలువరించారు. అయితే ఈ జీవోలో ఇంటలిజెన్స్  డీజీని మాత్రం చేర్చకపోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.

సంబంధిత వార్తలు

మేమే చెప్పాం, అందుకే ఇంటలిజెన్స్ డీజీ బదిలీ: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్