అమరావతి:రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలను సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్‌ను బుధవారం నాడు దాఖలు చేసింది.

మంగళవారం రాత్రి ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకొంది. ఎన్నికలకు సంబంధం లేని ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును కూడ విధుల నుండి తప్పించడంపై ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించింది.

మరో వైపు శ్రీకాకుళం, కడప ఎస్పీలను కూడ ఈసీ బదిలీ చేసింది.  వీరికి ఎన్నికల విధులను  కేటాయించకూడదని ఆదేశించింది.కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. వైసీపీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈసీకి  ఫిర్యాదులు చేసిందని టీడీపీ అనుమానిస్తోంది. 

ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకొంది. ఈ విషయమై బుధవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై  ఇవాళ విచారణ సాగనుంది.

సంబంధిత వార్తలు

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్