అమరావతి: ఎన్నికల పలితాలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

ఎన్నికల సమయంలో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ పునేఠను  ఈసీ బదిలీ చేసింది.  అనిల్ పునేఠ స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను నియమిస్తూ ఈసీ నియమించింది. జగన్ ఆస్తుల కేసులో నిందితుడుగా ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నాడని....ఆయనను సీఎస్‌గా ఎలా నియమిస్తారని చంద్రబాబు నాయుడు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.

2018 ఆగష్టు 1వ తేదీన అనిల్ పునేఠ  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఏడాది మే చివరి వరకు ఆయనకు పదవీ కాలం ఉంది. మే 31వ తేదీతో అనిల్ పునేఠ పదవీకాలం పూర్తి కానుంది. మే 23వ తేదీన  ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఒకవేళ చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి వస్తే ఎల్వీ సుబ్రమణ్యం స్థానంలో అనిల్‌ పునేఠను తిరిగి కొనసాగించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 ఎన్నికలకు ముందు డీజీపీ ఎస్ఎస్ యాదవ్‌ను ఈసీ విధుల నుండి తప్పించింది. 2009 ఎన్నికల్లో మరోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎస్ యాదవ్‌‌ను తిరిగి డీజీపీగా కొనసాగించారు.

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మరోసారి విజయం సాధిస్తే పునీఠను మరోసారి నియమించనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.అంతేకాదు మూడు మాసాల పాటు అనిల్  పునీఠకు పదవీకాలాన్ని పొడిగించే అవకాశం కూడ లేకపోలేదని చెబుతున్నారు. అయితే కేంద్రం నిర్ణయం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఒకవేళ చంద్రబాబునాయుడు అధికారాన్ని కోల్పోతే స్పెషల్ సీఎస్‌గా అనిల్ పునేఠ పదవీ విరమణ చేసే అవకాశం ఉంది.  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే  ఎల్వీ సుబ్రమణ్యం సీఎస్‌గా కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

సీఈసీతో ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనిల్ పునీఠ భేటీ

దిగొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం: ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ

ఐపీఎస్‌ల బదిలీ: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టులోషాక్

ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో రేపు వాదనలు

కీలక జీవోను జారీ చేసిన చంద్రబాబు సర్కార్:ఇంటలిజెన్స్‌కి మినహాయింపు

మేమే చెప్పాం, అందుకే ఇంటలిజెన్స్ డీజీ బదిలీ: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్