తెలంగాణకు వెళ్తే ఆంధ్రా వాళ్లను కొడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంల భాగంగా శుక్రవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్రవిభజన పరిస్థితులను ఆయన వివరించారు. రాజకీయాలు కులాలతో ముడిపడకూడదని అన్నారు. గొడవలు లేని భీమవరాన్ని తయారు చేస్తాన్నారు. తాను నడిచే నాయకుడినికాదని, ప్రజల సేవకుడినని అన్నారు. 

ప్రేమతో, సహనంతో దేన్నయినా జయించవచ్చునని, అందుకే తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. భావజాలంతో రాజకీయం ముడిపడాలని, కులంతో ముడిపడిన రాజకీయం చేయకూడదని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.