కడప: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (శనివారం) పులివెందులలో పార్టీ అభ్యర్థుల జాబితాను వెల్లడించడానికి సిద్ధపడ్డారు. ఇంతలోనే బాబాయ్ మరణ వార్త తెలిసింది. ఈ స్థితిలో వైఎస్ వివేకానంద మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు రాజకీయ రంగు పులుముకుంటుంది.

నిజానికి, వైఎస్ వివేకానంద రెడ్డిగారి హఠాన్మరణం వైసిపీ శ్రేణులను తీవ్ర దిగ్బ్రాంతి గురిచేసింది.  పార్టీ సభ్యులందరూ వివేకానందరెడ్డి స్వగ్రామానికి చేరుకుంటున్న ఈ సమయంలో సోషల్ మీడియాలోనే కాకుండా మీడియాలోనూ జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు ప్రారంభమయ్యాయి.

వైఎస్ వివేకానంద రెడ్డి జగన్ మోహన్ రెడ్డిని కలిశారని, వారి మధ్య కడప సీటు విషయంపై వాగ్వాదం జరిగిందని, దాని ఫలితంగానే వివేకానంద రెడ్డి మరణించారని ప్రచారం సాగించడం ప్రారంభమైంది. జగన్ మోహన్ రెడ్డి మార్చి 16వ తేదీ 175 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించబోతున్నారనేవిషయం తెలిసిందే. 

సరిగ్గా ఒక్క రోజు ముందు, ఈ దుర్ఘటన జరగడాన్ని అదునుగా రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారానికి దిగినట్లు వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల్లో జగన్ ను నైతికంగాగా దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

డీజీతో మాట్లాడిన బాబు: వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై దర్యాప్తునకు సిట్

మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం