Asianet News TeluguAsianet News Telugu

న్యూడ్ వీడియో తరువాత మరో వివాదంలో గోరంట్ల మాధవ్.. ఈ సారి ఏంటంటే..

హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కలకలం సద్దుమణగగానే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంటి అద్దె చెల్లించకుండా వేధిస్తున్నాడని యజమాని ఆరోపిస్తున్నారు. 

YCP MP Gorantla Madhav is another controversy
Author
First Published Nov 9, 2022, 6:47 AM IST

అనంతపురం : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు.  మూడున్నరేళ్లుగా అద్దె, విద్యుత్ బిల్లులు చెల్లించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి ఆరోపించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..  అనంతపురంలోని రామ్ నగర్ 80 అడుగుల రోడ్డులో  ఏడున్నర సెంట్లలో రెండంతస్తుల ఇల్లు ఉంది. మాధవ్ ఎంపీగా గెలిచాక తాను ఉండటం కోసం మల్లికార్జున రెడ్డి ఇంటిని అద్దెకు అడిగారు. ఆరు నెలలే ఉండి వేరే ఇంటికి మారతానని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ,గడువు దాటిన ఖాళీ చేయలేదు.

అంతే కాదు, అద్దె కూడా కట్టడం లేదు. మరి కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండేలా పెద్దమనుషుల ద్వారా వ్యవహారం నడిపారు. మూడేళ్లయినా అద్దె కానీ, కరెంటు బిల్లులు కానీ కట్టకపోవడంతో ఈ ఏడాది సెప్టెంబర్లో  ఖాళీ చేయాలని  యజమాని కోరాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  పోలీసులు, పలువురు రాజకీయ నాయకులు కల్పించుకుని మరో రెండు నెలలు అంటే అక్టోబర్ వరకు గడువు ఇప్పించారు. అయినా మారక పోవడంతో సోమవారం యజమాని  కొందరు పెద్దలతో కలిసి వెళ్లి తన ఇంటిని ఖాళీ చేయాలని కోరడానికి ప్రయత్నించగా ఎంపీ వాగ్వాదానికి దిగారు. 

తాను ఇల్లు మారేది లేదంటూ తెగేసి చెబుతున్నారు అని మల్లికార్జున రెడ్డి ఆరోపించారు. సిఐలు శివ రాముడు, జాకీర్ హుస్సేన్ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినకపోగా తనకే హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు. తనకు అద్దె కింద రూ.13 లక్షలు, విద్యుత్తు బిల్లు కింద రూ.2,50,412 చెల్లించాల్సి ఉందని వివరించారు. 

ఫ్యూడలిస్ట్ గోడలు బద్ధలు కొట్టాల్సిందే.. నేనూ ఎదురుచూస్తున్నా : ట్విట్టర్‌లో పవన్ వాయిస్ మెసేజ్

ఇదిలా ఉండగా, గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిమీద వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పని చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ మాధవ్ తీరుపై మండిపడ్డారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజలకు సేవ చేయకుండా.. నీలి చిత్రాలు  చూపించారు అని విమర్శించారు. ఎంపీ ఏ ముఖం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా, గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదని తెలిసినా ఈ గొడవ చల్లారడం లేదు. దీనిమీద వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆగస్ట్ 13న మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పినందుకు తనను దేశద్రోహిగా చిత్రీకరించి.. చిత్రహింసలు పెట్టి.. ఊరికి రాకుండా ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్న తమ పార్టీ ప్రభుత్వం.. నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ కు 500కార్లతో  భారీ స్వాగతం పలకడం ఏమిటని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios