కడప: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శ్రీనివాస్ రెడ్డి  రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్‌పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మహత్య కేసులో అనుమానితుడుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని  పోలీసులు విచారించారు. సూసైడ్ లేఖలో రెండు రకాల చేతి రాతలు ఉండడంపై కూడ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసులు రెడ్డి కోసం కానిస్టేబుళ్లను పంపితే ఒకరికి బదులుగా మరోకరిని తీసుకొచ్చారని సమాచారం. 

ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసులు రెడ్డిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారంటున్నారు. అయితే అతడిని వెంటనే పోలీసులు ఇంటికి పంపినట్టుగా  చెబుతున్నారు. తాము అనుమానిస్తున్న శ్రీనివాస్ రెడ్డి కాకుండా ఆత్మహత్య చేసుకొన్న శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు విచారించారు. ఈ విషయాన్ని ఐదు నిమిషాల్లోనే గుర్తించిన పోలీసులు వెంటనే అతడిని పంపించివేసినట్టుగా తెలుస్తోంది.

ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.సూసైడ్ నోట్‌  పై రెండు రకాలుగా ఉండడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు సూసైడ్ నోట్ లో సీఐ శ్రీరాములు పేరును కూడ పేర్కొన్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా నిందితుడు అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరో వైపు సీఐ  శ్రీరాములు పనితీరుపై కూడ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్