వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితుడి ఆత్మహత్యపై సందేహాలున్నాయన్నారు ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఏర్పాటు చేసిన వైసీపీ బాధితుల పునరావాస కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా వైసీపీ బాధిత టీడీపీ కార్యకర్తలను బాబు పరామర్శించారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ.. సూసైడ్‌నోట్‌లో రెండు చేతిరాతలున్నాయని అంటున్నారని.. వివేకా హత్య జరిగి వందరోజులైనా ఇప్పటికీ బయటపెట్టలేకపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు రాష్ట్రాన్ని ఏం కాపాడగలరని టీడీపీ అధినేత ప్రశ్నించారు.

ఇప్పటి వరకు తన మంచితనాన్నే చూశారని.. పోలీసుల తీరు మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై కేబినెట్ సమావేశంలో ఎందుకు ప్రస్తావించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 

అన్ని బయటకొస్తాయి: వివేకా హత్య కేసుపై శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నా ఇంట్లో 9 లక్షలు ఇవ్వండి..సూసైడ్ నోట్‌లో భాస్కర్ రెడ్డిని కోరిన శ్రీనివాస్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసు:జగన్ కు శ్రీనివాస్ రెడ్డి రాసిన లేఖ ఇదీ...

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్‌ నోట్ ఫోరెన్సిక్‌కు, కడపకు డీజీ

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడి ఆత్మహత్య: ఉత్పన్నమవుతున్న ప్రశ్నలివీ...

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్, పోలీసుల అనుమానాలివి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్