Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ys vivekananda murder case:srinivas reddy commits suicide in kadapa district
Author
Kadapa, First Published Sep 3, 2019, 7:11 AM IST

కడప:దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను తన కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నారని ఆయన సూసైడ్ చేసుకొన్నారు.

ఈ ఏడాది మార్చి 14వ తేదీన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా జగన్ సీఎం అయిన తర్వాత మరో సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

ఈ కేసులో అనుమానితులుగా ఉన్న గంగిరెడ్డి, రంగయ్య, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో నార్కో అనాలిసిస్ టెస్టులకు కూడ పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది.

కోర్టు అనుమతి మేరకు అనుమానితులకు నార్కో అనాలిసిస్ టెస్టులు కూడ చేశారు.ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసులు రెడ్డి మృతి చెందారు.

మృతి చెందే ముందు శ్రీనివాసులు రెడ్డి సీఎం వైఎస్ జగన్ కు, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు లేఖ రాసినట్టుగా సమాచారం.తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ లేఖ రాసినట్టుగా సమాచారం.ఈ లేఖను వైద్యులు పోలీసులకు అందించిన్టుగా తెలుస్తోంది.

పులివెందుల సీఐ శ్రీరాములు వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆయన సూసైడ్ లేఖ రాశాడు. ఈ కేసు విషయమై పోలీసులు వేధింపులకు పాల్పడినట్టుగా ఆయన ఆరోపణలు చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios