అమరావతి: ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా టీఆర్ఎస్‌తో కలిసేందుకు వైసీపీ  సానుకూలంగా ఉందనే ప్రచారం రావడంతో దీనికి కౌంటర్‌గా టీడీపీ ప్రయత్నాలను ప్రారంభించింది.  తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రజలను ఉద్దేశించి టీఆర్ఎస్ చేసిన  ప్రసంగాలను టీడీపీ బయటకు తీస్తోంది.

ఏపీ ప్రజలపై విద్వేషపూరితంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు చేసిన ప్రసంగాలను సోషల్ మీడియాతో పాటు ఇతరత్రా అన్ని వేదికల ద్వారా  టీడీపీ ప్రచారాన్ని చేస్తోంది.

ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటులో భాగంగా వైసీపీతో టీఆర్ఎస్ నేతలు ఇటీవల చర్చలు జరిపారు. కేసీఆర్ ఆదేశం మేరకు కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం జగన్‌తో  ఇటీవలనే  చర్చలు జరిపిపన విషయం తెలిసిందే. త్వరలోనే జగన్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు.

ఈ తరుణంలో  ఏపీ ప్రజలపై విద్వేషం కల్గించేలా గతంలో  టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రసంగాలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 

తెలుగు తల్లికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్, దళితుడిని సీఎం చేస్తానని ఇచ్చిన హామీ,  ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఈ విషయాలపై గతంలో టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను, కామెంట్స్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు అవకాశం ఉన్న చోటల్లా ఈ వీడియోలను ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ నేతలు ఏపీలో  టీఆర్ఎస్, వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన యూట్యూబ్ లింక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో తొలుత చం్రబాబునాయుడు పొత్తును పెట్టుకోవాలని భావించారు. కానీ, కేసీఆర్, కేటీఆర్‌లు మాత్రం వ్యతిరేకించారు. 

దరిమిలా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని పీపుల్స్ ఫ్రంట్‌లో  టీడీపీ భాగస్వామ్యమైనట్టుగా ఓ టీడీపీ నేత గుర్తు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి  లబ్దిపొందారని తెలుగు యువత నేత రావిపాటి శ్రీకృష్ణ  చెప్పారు. టీఆర్ఎస్ నేతలు ఏపీకి  వ్యతిరేకంగా  చేసిన ప్రసంగాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ ఎఫెక్ట్: ఎన్నికల వ్యూహల్లో బాబు, జగన్

కేసీఆర్, జగన్ దోస్తీ: గతాన్ని తవ్వుతున్న టీడీపీ

జగన్, కేసీఆర్ దోస్తీపై చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం

జగన్, కేసీఆర్ దోస్తీకి టీడీపీ కౌంటర్ వ్యూహం

బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని