అమరావతి: ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా  వైసీపీతో టీఆర్ఎస్ చర్చలు జరపడంతో ఏపీలో రాజకీయాలు వేడేక్కాయి.ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, విపక్ష నేత జగన్‌ విదేశీ పర్యటనలు కూడ రద్దు చేసుకొన్నారు.మరోవైపు రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవి మాసంలో విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో మరింత వేడి పెరిగింది.దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు.ఇందులో భాగంగానే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో కేటీఆర్ బృందం బుధవారం నాడు చర్చలను ప్రారంభించారు.

త్వరలో జరిగే ఏపీ రాజకీయాల్లో  కేసీఆర్ వేలు పెట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకుుల భావిస్తున్నారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగానే  వైసీపీతో టీఆర్ఎస్ చర్చలు జరిపింది.

ఏపీలో టీడీపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. ఇందులో భాగంగానే  తొలుత జగన్‌తో టీఆర్ఎస్ చర్చలు జరిపిందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో  చంద్రబాబునాయుడు కసరత్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుండి  టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న నేతలతో చర్చిస్తున్నారు. పార్టీలో చేరికల విషయమై పార్టీ నేతలకు సలహలిస్తున్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగాన్ని బాబు సన్నద్దం చేస్తున్నారు. టీఆర్ఎస్ తో పాటు వైసీపీ,బీజేపీ వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులకు బాబు సన్నద్దమౌతున్నారు. ఈ కారణాలతో చంద్రబాబునాయుడు థావోస్ పర్యటనను రద్దు చేసుకొన్నారు.  

ఇదిలా ఉంటే  పాదయాత్ర ముగించుకొన్న తర్వాత లండన్ పర్యటనకు వెళ్లాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్లాన్ చేసుకొన్నారు. వాస్తవానికి జగన్ ఇవాళ జగన్ కుటుంబసభ్యులతో కలిసి లండన్ వెళ్లాల్సి ఉంది.  జగన్ కూతురుకూడ లండన్ లో చదువుతోంది.

ఏపీలో చోటుచొసుకొంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ తన లండన్ పర్యటనను రద్దు చేసుకొన్నారు. జగన్ కూడ అసెంబ్లీకి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను సిద్దం  చేయాలని తలపెట్టారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై కేసీఆర్  కూడ జగన్ తో  ఈ నెలాఖరులో జగన్‌తో భేటీ అయ్యే అవకాశం లేకపోలేదు.

ఇదిలా ఉంటే రాజకీయ సమీకరణాల్లో కూడ మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదు. గత ఎన్నికల నాటికి త్వరలో జరిగే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి.  కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు ఉండదని తేలిపోయింది. అయితే బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నించనున్నాయి.

ఈ క్రమంలోనే జనసేన తమతో కలిసి పనిచేయాలని చంద్రబాబునాయుడు కోరారు. వైసీపీ  ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. వైసీపీకి టీఆర్ఎస్ ఏ రకంగా  మద్దతుగా నిలుస్తోందో చూడాలి.

ఏపీ టూర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై  టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధుత్వాలు, స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని బాబు పార్టీ నేతలకు గట్టిగానే  చెప్పారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్, జగన్ దోస్తీ: గతాన్ని తవ్వుతున్న టీడీపీ

జగన్, కేసీఆర్ దోస్తీపై చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం

జగన్, కేసీఆర్ దోస్తీకి టీడీపీ కౌంటర్ వ్యూహం

బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని