హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటులో భాగంగా వైసీపీ, టీఆర్ఎస్ మధ్య చర్చలు జరపడం ఏపీ రాజకీయాల్లో  వేడిని పుట్టించింది. అయితే ఈ సమయంలో వైసీపీపై గతంలో టీఆర్ఎస్ ఏ రకంగా  విమర్శలు గుప్పించిందో టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్ పర్యటనను టీఆర్ఎస్ నేతలు అడ్డుకొన్న విషయాన్ని  టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.  2009 ఎన్నికల్లో కడప నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా వైఎస్ జగన్ పోటీ చేసి విజయం సాధించారు.

2009 సెప్టెంబర్ రెండో తేదీన  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ మృతి చెందారు.  వైఎస్ మృతి చెందిన సమయంలో  ఆయన మృతి తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను చేపట్టారు.

2010 మార్చి 28వ  తేదీన వరంగల్ జిల్లాలో  ఓదార్పు యాత్రకు జగన్ రాకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకొన్నారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును జగన్ వ్యతిరేకించాడని టీఆర్ఎస్ నేతలు ఈ పర్యటనను అడ్డుకొన్నారు.

వరంగల్ జిల్లాలో ఓదార్పు యాత్రకు జగన్ వెళ్లకుండా టీఆర్ఎస్ నేతలు అడుగడుగునా అడ్డుకొనేందుకు సిద్దమయ్యారు. దీంతో జగన్‌ను అప్పటి నల్గొండ జిల్లాలోని ఆలేరు సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

మహబూబాద్ రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఆ సమయంలో  వైసీపీలో ఉన్న కొండా సురేఖ, కొండా మురళిలపై తెలంగాణ వాదులు రాళ్ల దాడి చేయడంతో  కాల్పులు కూడ చోటు చేసుకొన్నాయి.

ఈ పరిణామాలతో జగన్ వరంగల్ పర్యటన చేయలేదు.2011 మార్చి మాసంలో  జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో కేటీఆర్ జగన్ తో చర్చించిన తర్వాత ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడే సమయంలో జగన్ కేటీఆర్‌ను ఉద్దేశించి  తారక్ అంటూ వ్యాఖ్యానించారు.పాత విషయాలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఈ గిఫ్ట్ ఇవ్వడంలో భాగంగానే కేసీఆర్ తన దూతలుగా జగన్‌తో చర్చలకు కేటీఆర్ ను పంపారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్  ఏపీ ప్రజలపై చేసిన విమర్శలను  టీడీపీ గుర్తు చేస్తోంది.

సంబంధిత వార్తలు

జగన్, కేసీఆర్ దోస్తీపై చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం

జగన్, కేసీఆర్ దోస్తీకి టీడీపీ కౌంటర్ వ్యూహం

బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని