అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై జరిగిన కత్తిదాడి గుట్టు విప్పారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ పై దాడి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు ప్లాన్ చేశారని ఆరోపించారు. 

జగన్ నాటకానికి ప్రధాని మోదీయే డైరెక్టర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్నాటకం జరుగుతోందని ఘాటుగా విమర్శించారు. ప్రజలకు ఈ నాటకం పూర్తిగా అర్థమైందన్నారు.  

జగన్ పై దాడి సమయంలో ఎయిర్ పోర్టులో సీసీ కెమారాలు పని చేయకపోవడం చూస్తుంటే విజయవాడలో బీజేపీ ప్రతినిధి జీవీల్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇద్దరూ కలిసి ముందుగానే ఒక రహస్య ప్రదేశంలో ప్లాన్ చేశారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. 

ఒకప్పుడు పులివెందుల కృష్ణ ఎవరో తెలీదు అన్నారు. కానీ ఇప్పుడు ఆసుపత్రి వద్ద అన్నీ నడిపిస్తుంది కృష్ణనే అని చెప్పుకొచ్చారు. సంఘ విద్రోహ శక్తులన్నీ ఆస్పత్రి వద్ద మోహరించాయని బుద్దా అన్నారు. 

వెయిటర్ కు కత్తి ఇచ్చింది వైసీపీ నేతలే:జలీల్ ఖాన్ అనుమానం

విజయవాడ: మరోవైపు జగన్‌ పై దాడి వైసీపీ కుట్రేనని అందులో తెలుగుదేశం పాత్ర లేదని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. జగన్ ను పొడవమని వైసీపీ నేతలే వెయిటర్‌కు కత్తి ఇచ్చినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ వంటి నేతపై దాడి జరిగితే నిందితుడిని కొట్టకుండా పోలీసులకు అప్పగించేంత సహనం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. 

గతంలో జగన్ ఒక్కడే ఏపీ అభివృద్ధికి అడ్డుపడేవారని ఇప్పుడు ముగ్గురు తయారయ్యారని మండిపడ్డారు. జగన్, పవన్‌, బీజేపీ కలిసి రాష్ట్రంలో అల్లర్లకు కుట్ర పన్నారని జలీల్‌ఖాన్ ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ