ఇంజనీరింగ్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్ బాత్ రూమ్ లో ఓ స్టూడెంట్ (Student gives birth in bathroom of engineering college hostel)  ప్రసవించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)లోని నంద్యాల (nandyal) జిల్లాలో చోటు చేసుకుంది (engineering college in panyam). చిన్నారి ఆరోగ్యంగా ఉండగా.. తల్లి తీవ్ర రక్తస్రావంతో మరణించింది.

ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువతి కాలేజీ హాస్టల్ లోని బాత్ రూమ్ లో ప్రసవించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో జరిగింది. అయితే ఆ స్టూడెంట్ తీవ్ర రక్త స్రావంతో హాస్పిటల్ లో మరణించింది. ఆ పసిబిడ్డ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో విచారణ మొదలు పెట్టారు. 

రామ్ లల్లా శిల కోసం నా భార్య తాళి తాకట్టు పెట్టా..- కాంట్రాక్టర్ శ్రీనివాస్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం కేంద్రం శివారులో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఇందులో ఓ యువతి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆ కాలేజీకి చెందిన హాస్టల్ లోనే ఉంటోంది. రాత్రి సమయంలో కడుపు నొప్పి రావడంతో వెంటనే తల్లిదండ్రులకు కాల్ చేసింది. హాస్టల్ కు రావాలని సూచించింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు హాస్టల్ కు బయలు ప్రయాణం మొదలుపెట్టారు.

తాగిన మత్తులో సిబ్బందిని చెప్పుతో కొట్టిన పాక్ గాయకుడు.. వీడియో వైరల్

అయితే ఆ యువతి కడుపు నొప్పి అధికం కావడంతో బాత్ రూమ్ కు వెళ్లింది. చాలా సమయం వరకు ఆమె బయటకు రాకపోవడంతో అప్పటికే హాస్టల్ కు చేరుకున్న తల్లిదండ్రులు, స్నేహితులు కలిసి బాత్ రూమ్ డోర్లు బద్దలు కొట్టారు. లోపల ఆ యువతి బిడ్డకు జన్మనిచ్చి, రక్త మడుగులో పడి ఉండటాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపు..

కర్నూల్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అక్కడి డాక్టర్లు సూచించారు. అక్కడికి వెళ్లినప్పటికీ.. తీవ్ర రక్త స్రావం జరగడం వల్ల పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. అయితే ఆ చిన్నారి మాత్రం ఆరోగ్యంగా ఉంది. కాగా.. ఆ స్టూడెంట్ గర్భంతో ఉన్న విషయాన్ని కాలేజీ, హాస్టల్ మేనేజ్ మెంట్ గుర్తించకపోవడం, డెలివరీ అయ్యేంత వరకు కూడా స్నేహితులకు ఈ విషయం తెలియకపోవడం ఇక్కడ గమనార్హం. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.