MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నరేష్‌ బేబీని పవిత్ర లోకేష్‌ కొట్టేసిందా? బెంగుళూరు రోడ్డుపై దాబాలో.. మత్తు మందు ఇచ్చి తీసుకొచ్చాడట..

నరేష్‌ బేబీని పవిత్ర లోకేష్‌ కొట్టేసిందా? బెంగుళూరు రోడ్డుపై దాబాలో.. మత్తు మందు ఇచ్చి తీసుకొచ్చాడట..

పవిత్ర లోకేష్‌, నరేష్‌ చాలా కాలంగా కలిసే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కోసం సాహసం చేసింది. తప్పిపోయిన బేబీని కనిపెట్టిందట. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 26 2024, 11:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీనియర్ నటుడు నరేష్‌, నటి పవిత్ర లోకేష్‌.. అనేక నాటకీయ పరిణామాలు, వివాదాల అనంతరం ఇప్పుడు కలిసే ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా ప్రశాంతంగా తమ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ ఇద్దరు బయట కనిపించి ఏడాదిపైనే అవుతుంది. `మళ్లీ పెళ్ళి` సినిమా అనంతరం ఈ ఇద్దరు దూరమయ్యారు. నరేష్‌ కూడా కనిపించడం తగ్గించాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఈ ఇద్దరు మెరిశారు. తాజాగా `వీరాంజనేయులు విహారయాత్ర` సినిమా టీజర్‌ ఈవెంట్లో మెరిశారు. ఇందులో నరేష్‌ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా టీజర్‌ ఈవెంట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి గెస్ట్ గా పవిత్రా లోకేష్‌ వచ్చారు. టీజర్ ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 
 

36

ఇందులో రామోజీరావుని గుర్తు చేసుకుని ఆయనపై ప్రశంసలు కురిపించారు. తాను కన్నడలో నటించే సమయంలో రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. దీని గురించి అంతా మాట్లాడుకునేవాళ్లు. వారి ఈటీవీ సంస్థలో తాను ఒక్క సీరియల్‌ అయినా చేయాలని అనుకునేదాన్ని,  అవకాశం వచ్చింది. కన్నడ ఈటీవీలో తాను సీరియల్‌ చేశాను. అది ఐదేళ్లు ఆడింది. తన సినిమాలు ఆర్‌ఎఫ్‌సీలో షూట్‌ అయినప్పుడు అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి ఆయన స్టార్ట్ చేసిన ఈటీవీ విన్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కావడం హ్యాపీగా ఉంది. 
 

46

నరేష బేబీ పోయిందని తెగ బాధపడ్డారు. ఆ బేబీని వెతికి పట్టుకుని వచ్చాను. చాలాకష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇక దాన్ని కాపాడుకునే బాధ్యత మీదే అంటూ వెల్లడించింది పవిత్ర లోకేష్‌. ఈ సందర్భంగా నరేష్‌ గురించి ఆమె మాట్లాడుతూ, ఆయన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఆయన ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్‌ అని ప్రశంసలు కురిపించింది. పాత్రవస్తే దాన్ని చిన్న పిల్లాడిలా తీసుకుని నేర్చుకుని చేస్తాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. 
 

56

నరేష్‌ ఎలాంటి పాత్ర చేసినా అందులో జీవిస్తాడు. పాత్ర చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి, ఏంటి? అని అనేకరకాలుగా ఆలోచిస్తారు. ముందుగానే ప్రిపేర్‌ అవుతాడు. బాగా చేయాలని తపిస్తుంటాడు. ఆయనతో పార్ట్ కావడం ఆనందంగా ఉంది. ఈ స్క్రిప్ట్ విషయంలోనూ ఆయన ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు. ఫ్యామిలీ విషయంలో ఆయనకు కేర్‌ ఎక్కువ. ఇందులో అలాంటి ఎలిమెంట్లే ఉన్నాయి. కచ్చితంగా అందరికి నచ్చే సినిమా అవుతుందని వెల్లడించింది పవిత్ర లోకేష్‌. ఆమె మాటలకు పక్కనే ఉన్న నరేష్‌ ఒప్పొంగిపోయాడు. కాసేపు ఆమె మాటలకు సరదాగా రియాక్ట్ అయిన తీరు ఆకట్టుకుంటుంది. 

66

బేబీ ఎక్కడికిపోయిందో చెప్పాడు నరేష్‌. బెంగుళూరు హైవేపై దాబా వద్దఉందని, లోపల పవిత్ర రాగిముద్ద నాటుకోడి తింటుందని, ఆసమయంలో మత్తు మందు పెట్టి తీసుకొచ్చినట్టు నరేష్‌ చెప్పడం హిలేరియస్‌గా అనిపించింది. ఎవరికీ చెప్పొద్దంటే చాలా గౌరవంగా తీసుకొచ్చిందని నరేష్‌.. పవిత్రపై కామెంట్ చేయడం విశేషం. అయితే నరేష్‌ బేబీని పవిత్ర తీసుకుపోయిందని దీన్ని బట్టి క్లారిటీ వస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: కాక్‌టెయిల్ 2.. దియా రెడ్డి పాత్రకు ఎమోషనల్ గుడ్‌బై చెప్పిన రష్మిక
Recommended image2
Epic Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి రొమాన్స్ తో పెరిగిపోయిన అంచనాలు.. 'ఎపిక్' రిలీజ్ డేట్ ఇదేనా ?
Recommended image3
VishnuPriya: కష్టం లేకుండా నెలకు రూ.20 లక్షలు సంపాదిస్తున్న యాంకర్.. సుమ, శ్రీముఖి లకు కూడా సాధ్యం కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved