తాగిన మత్తులో సిబ్బందిని చెప్పుతో కొట్టిన పాక్ గాయకుడు.. వీడియో వైరల్
ప్రముఖ పాక్ సింగర్ రహత్ ఫతే అలీఖాన్ (Pakistani Singer Rahat Fateh Ali Khan) తన వ్యక్తిగత సిబ్బందిపై దాడి (Attack on personal staff) చేశారు. మద్యం మత్తులో ( Alcohol intoxication) తన బాటిల్ ఎక్కడా ? అంటూ ఓ వ్యక్తిని కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral on social media)గా మారింది.
పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ సింగర్ రహత్ ఫతే అలీఖాన్ మద్యం మత్తులో తన సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్)లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సింగర్ ఖాన్ ను మొదట ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టారు. తరువాత చెప్పులతో కొట్టారు. ‘నా బాటిల్ ఎక్కడ ?’ అంటూ అరుస్తున్నారు.
రామ్ లల్లా శిల కోసం నా భార్య తాళి తాకట్టు పెట్టా..- కాంట్రాక్టర్ శ్రీనివాస్
అనంతరం జుట్టును లాగుతూ నెలపై కూర్చొబెట్టాడు. దీంతో అదే రూమ్ లో ఉన్న పలువురు సింగర్ అలీఖాన్ ను నిలవరించేందుకు ప్రయత్నించారు. అయినా అతడిని నిర్ధాక్షిణ్యంగా కొట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగర్ సిబ్బందిని అలా కొట్టడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కొంత సమయం తరువాత సింగర్ రహత్ ఫతే అలీఖాన్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో తన సిబ్బందిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందో వివరించారు. ఆ సీసాలో ఆల్కహాల్ లేదని, అందులో ‘పవిత్ర జలం’ ఉందని ఖాన్ చెప్పారు. అయితే ఆ వీడియోలో బాధితుడు కూడా మాట్లాడారు. తాను అనుకోకుండా ఆ బాటిల్ ను పోగొట్టానని చెప్పారు. ఖాన్ తనపై దాడి చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పారని బాధితుడు స్పష్టం చేశారు.
కాగా.. ఇదే వీడియోలో సింగర్ రాహత్ తనతో 40 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని పరిచయం చేశారు. అతడు తన డ్రైవర్ అని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రహత్ ఫతే అలీఖాన్ ను తాను 40 ఏళ్లుగా చూస్తున్నానని, ఆయన చాలా మంచి వారని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఖాన్ ఇలా వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అమెరికాలో ప్రదర్శన ఇచ్చేందుకు ఆయనకు వీసా నిరాకరించడంతో పాటు విదేశీ ధనాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.