శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారంనాడు స్టీమ్ వాటర్ బాయిలర్ పేలుడు చోటు చేసుకుంది.

శ్రీశైలం: మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారంనాడు స్టీమ్ వాటర్ బాయిలర్ పేలింది.దీంతో అ క్కడ  పనిచేస్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు.నిత్య అన్నదానం బయటవైపు  ఈ ప్రమాదం  జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాయిలర్ పేలుడుకుగల కారణాలపై అధికారులు ఆరా  తీస్తున్నారు.స్టీమింగ్ బాయిలర్ బాగా  వేడేక్కడంతో పేలిపోయినట్టుగా అక్కడ  పనిచేసే సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ బాయిలర్  పేలుుడు కారణంగా ఎవరికీ ఎలాంటి  ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.