
Drug Abuse: డ్రగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకుప్రత్యేక ఆపరేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ నియంత్రణకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) బృందం మరింత కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డీ-అడిక్షన్ సెంటర్ల పనితీరును సమీక్షించిన ఈగుల్ టీమ్, చికిత్సా విధానాలు మరియు సౌకర్యాలపై ఆరా తీసింది.