రంపచోడవరం: దాదాపు 40 మంది జలసమాధికి కారణమైన రాయల్ వశిష్ట బోటు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. రాయల్ వశిష్ట బోటు యాజమాని నిందితుడు కోడిగుడ్ల వెంకటరమణ, ఎల్లా ప్రభావతి, అచ్యుత రమణిలను అరెస్ట్ చేసినట్లు రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం తెలిపారు. 

ఏ-వన్ కోడిగుడ్ల వెంకటరమణ, ఏ-2గా ఎల్లా ప్రభావతి, ఏ-3గా యర్రంశెట్టి అచ్యుత రమణిలను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మిగిలిన ముద్దాయిల గురించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. నిందితులను రంపచోడవరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. 

ప్రమాదం జరిగిన రోజు దేవీపట్నం పోలీస్ స్టేషన్లో బోటు సిబ్బందిపై పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బోటు ఓనర్స్ , టూర్స్ అండ్ ట్రావెల్స్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

ప్రమాదం జరిగిన రోజు సుమారు గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా నడుస్తోందని తెలిపారు. అయితే అనుభవం లేదని బోటు డ్రైవరే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. ఆ సమయంలో బోటు డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలని వారు గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉన్నా నడిపారని ఆరోపించారు. 

ఈ ప్రమాదంలో 26 మందిని కచ్చులూరు గ్రామస్థులు కాపాడారని వారికి అభినందనలు తెలుపుతున్నట్లు ఏఎస్పీ వకులు జిందాల్ తెలిపారు. గల్లంతైన వారికోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బోటును కూడా వెలుపలికి తీసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ఏఎస్పీ తెలిపారు. 

ఇకపోతే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ప్రమాదంలో 34 మంది చనిపోయినట్లు ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అలాగే 15 మంది మిస్సైనట్లు చెప్పుకొచ్చారు. కచ్చులూరు గ్రామస్తులు 26 మందిని కాపాడినట్లు ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

మంత్రి అవంతి శ్రీనివాస్ తాగి మాట్లాడుతున్నారా..?: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్