అమరావతి: తన అభిమానికి పుట్టిన కూతురుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు. పార్టీ నేతలతో సమావేశాల్లో పాల్గొనేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మూడు రోజులుగా విజయవాడలో ఉంటున్నారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని ఎర్రం అంకమ్మరావు, ఇందిర దంపతులకు పాప పుట్టింది. అంకమ్మరావు ... పవన్ కళ్యాణ్ అభిమాని.  తన పాపకు పేరు పెట్టాలని  కోరుతూ పవన్ కళ్యాణ్‌ను  కోరారు. 

ఆ పాపను పవన్ కళ్యాణ్ ముద్దు చేశారు. అంతేకాదు  ఆ పాపకు వేద వినీషా అని పేరు పెట్టారు. ఆ పాపను ఎత్తుకొని పవన్ ముద్దు చేశారు. పాపకు నామకరణం చేసిన తర్వాత  పవన్ కళ్యాణ్  ఆ దంపతులతో ఆయన పోటోలు దిగారు.