Asianet News TeluguAsianet News Telugu

ఉల్లి కోసం జనం బారులు: వేలికి సిరా గుర్తు, మళ్లీ మళ్లీ వచ్చే వారికి చెక్

నెల్లూరు జిల్లాలో అధికారులు విభిన్నంగా ఆలోచించారు. ఉల్లి తీసుకున్నవారు మళ్లీ మళ్లీ రాకుండా వేలికి సిరా వేసి మరీ పంపిస్తున్నారు. 

onion crisis: Officials applying indelible ink in nellore
Author
Nellore, First Published Dec 10, 2019, 4:53 PM IST

ఎన్నికల్లో ఓటు ఎంత ముఖ్యమో.. చూపుడు వేలికి సిరా గుర్తుది కూడా అంతే ముఖ్యం. మనం ఓటేశామని నలుగురికి చూపించడంతో పాటు దొంగ ఓట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘానికి ఆయుధంగా ఉపయోగపడేది కూడా సిరా చుక్కే.

అయితే ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు చుక్కలను అంటుతున్న సంగతి తెలిసిందే. ఉల్లి కొరతతో సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నాడు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు భారీగా ఉండటంతో ప్రభుత్వాలు సబ్సిడీపై ఉల్లిని ప్రజలకు సరఫరా చేస్తున్నాయి.

Also read:OnionPrice : ఉల్లికోసం తొక్కిసలాట...

ఉదయం 5 గంటల నుంచే జనం సబ్సిడీ ఉల్లి పాయల కోసం క్యూలో నిలబడుతున్నారు. ఈ క్రమంలో ఒకసారి ఉల్లి కొనుగోలు చేసిన వారు మళ్లీ తిరిగొచ్చి కొనుగోలు చేస్తుండటంతో మిగిలిన వారికి అందడం లేదు.

దీంతో నెల్లూరు జిల్లాలో అధికారులు విభిన్నంగా ఆలోచించారు. ఉల్లి తీసుకున్నవారు మళ్లీ మళ్లీ రాకుండా వేలికి సిరా వేసి మరీ పంపిస్తున్నారు. కాగా కావలిలో ఉల్లిపాయల కోసం ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు.

Also Read:OnionPrice : ఉల్లి కోసం లైన్లో నిలబడితే...ప్రాణాలు పోయాయి...

మరోవైపు రాయితీ ఉల్లిని కొందరు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని జనం మండిపడుతున్నారు. అలాగే ఒకే కౌంటర్ కాకుండా కనీసం రెండు, మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios