OnionPrice : ఉల్లి కోసం లైన్లో నిలబడితే...ప్రాణాలు పోయాయి...

కృష్ణాజిల్లా గుడివాడలో దారుణం జరిగింది. ఉల్లిగడ్డ ధరలు పెరిగిన నేపథ్యంలో రైతుబజార్ లో సబ్సిడీ ఉల్లి సరఫరా చేస్తున్నారు. 

First Published Dec 9, 2019, 11:23 AM IST | Last Updated Dec 9, 2019, 11:23 AM IST

 కృష్ణాజిల్లా గుడివాడలో దారుణం జరిగింది. ఉల్లిగడ్డ ధరలు పెరిగిన నేపథ్యంలో రైతుబజార్ లో సబ్సిడీ ఉల్లి సరఫరా చేస్తున్నారు. దీనికోసం ఉదయం నుండే జనాలు బారులు తీరారు. గంటకొద్దీ క్యూ లైన్లో నిలబడ్డ 65 యేళ్ల సాంబయ్య అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తే అప్పటికే గుండెపోటుతో మరణించాడని తేల్చారు.