హైదరాబాద్: పదవి కోసం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై గురువారం నాడు జరిగిన దాడిపై శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా  విమర్శలు గుప్పించారు.

 

 వైసీసీ కోడి కత్తి డ్రామా ఆడుతోందన్నారు.  అధికారం కోసం  అడ్డదారులు  తొక్కడం  జగన్‌ మోడీ రెడ్డికి  కొత్త కాదన్నారు.  మరోసారి ఒటమి తప్పదనే భయంతోనే  కోడి కత్తి డ్రామాకు తెరలేపారని జగన్‌ తీరును ఆయన దుయ్యబట్టారు. 

దాడి వెనుక ఉన్న వైసీపీ కుట్ర ప్రజలకు అర్ధమైందని.....దీంతో ప్రజలను మభ్యపెట్టేందుకు  వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే  సీఎం పీఠంపై కన్నేసీని వ్యక్తి కత్తి డ్రామాలు ఆడడంలో ఆశ్చర్యం లేదన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా నిజం మాత్రమే ప్రజల ముందు  గెలుస్తోందన్నారు. చివరగా #Jagannatakam (జగన్నాటకం) అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను లోకేశ్‌ తగిలించారు.

సంబంధిత వార్తలు

ఏపీ పోలీసులకు జగన్ షాక్: తెలంగాణ పోలీసులైతే ఓకే

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ