ఏపీ సిట్ బృందానికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  షాకిచ్చారు.

హైదరాబాద్: ఏపీ సిట్ బృందానికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ షాకిచ్చారు. సిటీ న్యూరో సెంటర్‌లో డిశ్చార్జీ అయ్యే ముందు సిట్ బృందం జగన్‌ను కలిశారు. అయితే ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదన్నారు. తెలంగాణ పోలీసులు వస్తే స్టేట్ మెంట్ ఇస్తానని జగన్ చెప్పినట్టు సమాచారం.

గురువారం నాడు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనపై ఏపీ డీజీపీ ఠాగూర్ విశాఖ పోలీసులతో సిట్ ఏర్పాటు చేశారు.

ఈ సిట్ బృందం శుక్రవారం నాడు సిటీ న్యూరో సెంటర్ లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిసింది. అయితే సిట్ బృందానికి తాను స్టేట్‌మెంట్ ఇవ్వబోనని జగన్ తేల్చి చెప్పారు. ఏపీ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇవ్వడం తనకు ఇష్టం లేదని జగన్ తేల్చిచెప్పేశారు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పినట్టు సమాచారం.

అంతేకాదు తెలంగాణ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు తనకు సమ్మతమేనని జగన్ చెప్పారని తెలిసింది. జగన్ స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో సిట్ బృందం వెను దిరిగారు. అయితే జగన్ స్టేట్‌మెంట్ ఇవ్వకపోవడంతో సిట్ తర్వాత ఏం చేయనుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ఘటన జరిగిన నుండి వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు.ఈ దాడి వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని కూడ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ