కర్నూలులో కుటుంబ కలహాలు అన్నెంపున్నెం తెలియని ఇద్దరు చిన్నారుల్ని బలి తీసుకున్నాయి. తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని కూడా బావిలోకి తోసింది. పిల్లలు చనిపోగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
కర్నూలు : kurnool మండలం పూలతోటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలోకి దూకింది. గమనించిన స్థానికులు వెంటనే ముగ్గురిని కాపాడేందుకు యత్నించారు. కాగా ఇద్దరు పిల్లలు అప్పటికే మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. family disputesయే ఘటనకు కారణమని బంధువులు చెబుతున్నారు. ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో వేర్వేరు తేదీల్లో రెండు చోట్ల ఇలాంటి ఘటనలే జరిగాయి. ఫిబ్రవరి 14న belagaviలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ, ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా.. భర్త, అత్తమామలను అరెస్ట్ చేసేంతవరకు అంత్యక్రియలు చేయబోమని మహిళ కుటుంబీకులు భీష్మించుకున్నారు. ఆదివారం బెలగావి బిమ్స్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆమె భర్త మనీష్, అతని కుటుంబమే ఆమెను హత్య చేశారని ఆరోపించారు.
వారందరినీ అరెస్టు చేసే వరకు మృతదేహాలను తీసుకునేది లేదంటూ ధర్నా నిర్వహించారు. దీంతో మూడు రోజుల నుంచి బిమ్స్ ఆసుపత్రి మార్చురీలోనే తల్లిపిల్లల మృతదేహాలు ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన బెళగావి హిండలగా గణపతి ఆలయం చెరువులో క్రిషా కేశ్వానీ (36), పిల్లలు వీరెన్ (7), బావీర్ (4) మృతదేహాలు తేలాయి. ఇది తెలిసిన వెంటనే భర్త మనీష్, కుటుంబ సభ్యులు పరారయ్యారు. కాగా, ఆదివారం మనీష్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ త్రిషకు వేరొకరితో సంబంధం ఉందని అదే ఆత్మహత్యలకు కారణం అని అన్నాడు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 7న Family strifeతో విసిగిపోయిన ఓ woman ముగ్గురు పిల్లలతో సహా jurala canalలోకి దూకిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని wanaparthy జిల్లా pebberuలో చోటుచేసుకుంది. ఇందులో ఓ బాలుడిని స్థానిక యువకుడు రక్షించగా.. మిగతా ముగ్గురు మాత్రం గల్లంతయ్యారు. పెబ్బేరు ఎస్ఐ రామస్వామి, స్థానికుల కథనం ప్రకారం... పెబ్బేరు పట్టణానికి చెందిన డిసిఎం డ్రైవర్ తెలుగు స్వామి, భవ్యలు పదేళ్ల కిందట ప్రేమించుకుని, కులాంతర వివాహం చేసుకున్నారు.
వీరికి అయిదేళ్ల జ్ఞానేశ్వరి, మూడేళ్ల వరుణ్, ఏడాది వయసున్న నిహారిక సంతానం. కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో భార్యభర్తలు గొడవ పడుతున్నారు. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన భవ్య.. ముగ్గురు పిల్లలను తీసుకుని రాత్రి ఏడున్నర గంటల సమయంలో పట్టణ సమీపంలో ఉన్న జూరాల ఎడమ ప్రధాన కాలువలోకి దూకింది. స్థానికులు గమనించి కేకలు వేయడంతో.. అటువైపు వెళుతున్న కుమార్ అనే యువకుడు మూడేళ్ల వరుణ్ ని కాపాడగలిగాడు.
తల్లి, ఇద్దరు కుమార్తెలు మాత్రం గల్లంతయ్యారు. విషయం తెలిసిన ఎస్ఐ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే రామన్ పాడు జలాశయం అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపి వేయించారు. పూర్తి వివరాలు తెలుసుకుంటామని, ఉదయం గాలింపు చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటివరకు తమకు ఎవరూ దీని మీద ఫిర్యాదు చేయలేదని అన్నారు.
