Asianet News TeluguAsianet News Telugu

నర్సరావుపేటలో లోకేష్‌ పర్యటనకు అనుమతి నిరాకరణ.. పోలీసులపై టీడీపీ నేతల విమర్శలు

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కోట అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లాలని నిర్ణయించుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయన పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.

high tension in narsaraopet over police red signal for lokesh tour
Author
Amaravati, First Published Sep 8, 2021, 9:53 PM IST

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కోట అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లాలని నిర్ణయించుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇప్పటి వరకూ కర్నూలు సహా పలు చోట్ల లోకేష్ పర్యటించి ప్రేమోన్మాదుల చేతులలో హత్యకు గురైన వారి కుటుంబాలను పరామర్శించారు.

అయితే నర్సరావుపేట పర్యటనకు మాత్రం పోలీసులు నిరాకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటనలు చేశారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నర్సరావుపేటలోచనిపోయింది కోట అనూష అయితే ఆ విషయం కూడా ఆయన మర్చిపోయినట్లుగా వేరే పేరు చెప్పారు. ఎమ్మెల్యే విమర్శలపై సోషల్ మీడియాలో లోకేష్ ఘాటుగా విరుచుకుపడ్డారు. గుర్తు చేసేందుకే తాను నర్సరావుపేట వస్తున్నానని ప్రకటించారు.

మరో వైపు లోకేష్ పర్యటనకు సంబంధించి గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రెస్‌మీట్ పెట్టారు. లోకేష్ పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లాలో జరిగిన ఆడపిల్లల హత్య కేసులో నిందితులను పోలీసులు వెంటనే పట్టుకుకున్నారని..  కొంతమంది మాత్రం దిశా చట్టం మీద అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios