అమరావతి:ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  దాడి ఘటనతో ఆ రాష్ట్ర రాజకీయాలు  వేడేక్కాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్  ప్రధానమంత్రి మోడీతో సమావేశమయ్యారు.

జగన్ పై దాడి జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో  గవర్నర్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్నిసంస్థలు, రాజకీయ పార్టీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు చోటు చేసుకొంటున్న నేపథ్యంలో  గవర్నర్  ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి కల్గిస్తోంది.

వైఎస్ జగన్‌పై  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  దాడి జరిగిన తర్వాత ఏపీ డీజీపీని గవర్నర్ నివేదిక అడగడాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తప్పుబట్టిన విషయం తెలిసిందే.  

ఈ పరిణామాల నేపథ్యంలో  ఢిల్లీలో  ఉన్న గవర్నర్ మోడీతో సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై గవర్నర్  ప్రధాని మోడీకి  రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం.అంతేకాదు జగన్‌పై దాడి ఘటన కూడ ఈ సమావేశంలో చర్చకు వచ్చిందని తెలుస్తోంది. 

ప్రధానితో  గవర్నర్ భేటీ ముగిసిన తర్వాత   గవర్నర్ నరసింహాన్ ‌తో  మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్న సమయంలో   గవర్నర్‌తో లగడపాటి భేటీలో అంతర్యమేమిటనే  విషయమై రాజకీయవర్గాల్లో  సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

ఏపీ పోలీసులకు జగన్ షాక్: తెలంగాణ పోలీసులైతే ఓకే

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ