Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పెళ్లి కొడుకుతో సహా ఐదుగురికి తీవ్ర గాయాలు..

పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. వివాహం తర్వాత వరుడి ఇంటికి బయలుదేరిన పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకుతో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

five injured along with groom in road accident in krishna district
Author
First Published Aug 13, 2022, 11:53 AM IST

పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. వివాహం తర్వాత వరుడి ఇంటికి బయలుదేరిన పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకుతో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. అత్తిలిలో పెళ్లి తర్వాత పెళ్లి బృందం హైదరాబాద్‌లోని వరుడు ఇంటికి బయలుదేరింది. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు అంపాపురం వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొని పెళ్లి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. 

ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో పెళ్లికొడుకు ఉన్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా,  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios