
Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో భట్టివిక్రమార్క కుటుంబం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేశం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.