అమరావతి:మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరే విషయాన్ని చంద్రబాబునాయుడు తనతో చర్చించలేదని  ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు

ఏపీ అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బుధవారం నాడు కలిశారు.బాబును కలిసిన తర్వాత కేఈ కృష్ణమూర్తి లాబీల్లో కేఈ కృష్ణమూర్తి మీడియాతో చిట్ చాట్ చేశారు.

శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయాన్ని మాత్రమే చర్చించినట్టు ఆయన తెలిపారు.కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరే విషయమై బాబు నా వద్ద ప్రస్తావిస్తే  తన  అభిప్రాయాన్ని చెబుతానని కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు.

కోట్ల ప్యామిలీ జిల్లాలోని ఏఏ అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు అడుగుతున్నారో కూడ తనకు తెలియదన్నారు.కోట్ల ఫ్యామిలీ టీడీపీ లో చేరే విషయమై తాను మాత్రం నేరుగా బాబుతో ప్రస్తావించబోనని  కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే  కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరడాన్ని కేఈ కృష్ణమూర్తి వ్యతిరేకిస్తున్నట్టు  చెబుతున్నారు.

కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరే విషయాన్ని కేఈ కృష్ణమూర్తికి సమాచారం ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఈ విషయమై తనకు సమాచారం లేదని కేఈ కృష్ణమూర్తి ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి: చంద్రబాబు స్కెచ్ ఇదీ...

కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి: బాబుకు షరతులివే...

టీడీపిలోకి కోట్ల: చంద్రబాబుపై టీజీ వెంకటేష్ విశ్వాసం

చినబాబు హామీ బుట్ట దాఖలా: కోట్ల రాకతో మారిన పరిస్థితి, బుట్టా రేణుక స్పందన ఇదీ...

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి: తెర వెనుక ఎవరు

చంద్రబాబు వ్యూహం: కోట్ల ఫ్యామిలీతో జగన్‌కు చెక్

పసుపు కోటలోకి కోట్ల కుటుంబం: చంద్రబాబుతో భేటీ

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రూట్ క్లియర్: మరి సుజాతమ్మకు...?

మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ