అమరావతి:బాబ్లీ ప్రాజెక్టు కేసుకు సంబంధించి ధర్మాబాద్ కోర్టులో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరపున  ఆయన తరపు న్యాయవాదులు  రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు.

బాబ్లీ ప్రాజెక్టు సందర్భన కోసం 2010 జూలై 16వ తేదీన వెళ్లిన  అప్పటి విపక్ష నేత చంద్రబాబునాయుడు సహ పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులను  మహరాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ విషయమై కేసు నమోదైంది.

బాబ్లీ ప్రాజెక్టు సందర్భనకు వచ్చిన చంద్రబాబు సహ పలువురు  టీడీపీ ప్రజా ప్రతినిధులు అధికారుల విధులకు ఆటంకం కల్గించారని  కేసు నమోదైంది. ఈ కేసు విషయమై 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ను గత మాసంలో జారీ చేసింది.

2018 సెప్టెంబర్ 21వ తేదీన ధర్మాబాద్ కోర్టుకు హజరుకావాలని ఆదేశించింది.  అయితే  ధర్మాబాద్ కోర్టుకు హజరైన మాజీ ఎమ్మెల్యేలు  కేఎస్ రత్నం గంగుల కమలాకర్,  ప్రకాష్‌గౌడ్ లకు  కోర్టు సెప్టెంబర్ 21న బెయిల్ మంజూరు చేసింది.

అయితే సెప్టెంబర్ 21 వ తేదీన చంద్రబాబునాయుడు కోర్టుకు హాజరుకాలేదు. ఆయన తరపున  న్యాయవాదులు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే అక్టోబర్ 15వ తేదీన విచారణను వాయిదా వేసింది. అక్టోబర్ 15వ తేదీన కోర్టుకు హజరుకావాలని  కోర్టు ఆదేశించింది. ఎవరికీ కూడ ప్రత్యేక మినహయింపులు కూడ  ఉండవని కోర్టు సెప్టెంబర్ 21న తేల్చి చెప్పింది.

ఇదిలా ఉంటే  ధర్మాబాద్ కోర్టుకు హాజరుకాకుండా చంద్రబాబునాయుడు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. బాబు తరపు న్యాయవాదులు  గురువారం నాడు ధర్మాబాద్ కోర్టులో రీకాల్ పిటిషన్ వేశారు ఈ కేసుపై చంద్రబాబనాయుడు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది లూత్రా వాదనలను విన్పించనున్నారు.

సంబంధిత వార్తలు

ధర్మాబాద్ కోర్టుకు గైర్హాజరు: చంద్రబాబు నిర్ణయం

బాబ్లీ కేసు: కోర్టుకి ర్యాలీగా వెళ్దామన్న మంత్రి, ఆలోచిద్దామన్నచంద్రబాబు

బాబ్లీ కేసులో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్

బాబ్లీకేసు: ధర్మాబాద్‌ కోర్టులో బాబు రీకాల్ పిటిషన్

బాబ్లీ కేసు: ధర్మాబాద్‌ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్న రవీంద్రకుమార్

బాబ్లీ కేసుపై రేపే విచారణ : తెలంగాణ నేతలిద్దరు స్వయంగా హాజరయ్యే అవకాశం

బాబ్లీకేసు: రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని బాబు నిర్ణయం

నాన్ బెయిలబుల్ వారంట్‌పై బాబు మల్లగుల్లాలు: ఏం చేద్దాం?

నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు

అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ
'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు