Asianet News TeluguAsianet News Telugu

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు

ఉత్తర తెలంగాణ నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఆనాడూ బాబ్లీ ప్రాజెక్టు విషయమై పోరాటం చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు

chandrababunaidu reacts on dharmabad court warrant
Author
Kurnool, First Published Sep 14, 2018, 3:35 PM IST


కర్నూల్: ఉత్తర తెలంగాణ నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఆనాడూ బాబ్లీ ప్రాజెక్టు విషయమై పోరాటం చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.

శుక్రవారం నాడు కర్నూల్ జిల్లాలో జలసిరికి హరతికి కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన  సభలో చంద్రబాబునాయుడు మాట్లాడారు. 

ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే అవకాశం అవుతోందని  ఆనాడు పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  బాబ్లీ కేసులో  నాకు నోటీసులు ఇచ్చారని అంటున్నారన్నారు.  ఆనాడు ఉత్తర తెలంగాణ ప్రజల కోసం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

తాను ఎక్కడా కూడ అన్యాయం చేయలేదన్నారు. నేరాలు ఘోరాలు చేయలేదని చంద్రబాబునాయుడు చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయమై నిరసన తెలపడానికి వెళ్తే ఏపీ బోర్డర్ లోనే అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఏం చేస్తారో చేయాలని తాను ఆనాడే చెప్పారన్నారు

కేసులు పెట్టారని.. పెట్టలేదని చెబుతూ తమను మహారాష్ట్ర నుండి హైద్రాబాద్ లో విమానంలో తీసుకొచ్చి వదిలేశారని ఆయన చెప్పారు. ప్రజాహితం కోసం నిరంతరం పనిచేస్తున్నట్టు బాబు చెప్పారు.

ప్రాజెక్టులో ప్రాజెక్టు కట్టడం తప్పని ఆనాడు బాబ్లీపై పోరాటం చేసినట్టు చెప్పారు. అయితే ఆనాడు తమను  ఉమ్మడి ఏపీ రాష్ట్ర సరిహద్దులోనే అరెస్ట్ చేసినట్టు బాబు చెప్పారు. బాబ్లీ కేసు విషయంలో  ఏం చేయాలనే దానిపై  ఆలోచిస్తామన్నారు. 

 

 

ఈ వార్తలు చదవండి

అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ
'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

 

Follow Us:
Download App:
  • android
  • ios