ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌పై  రీకాల్ పిటిషన్  వేస్తే ఎలా ఉంటుందనే  విషయమై  ఆలోచించాలని మంత్రులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సూచించారు


అమరావతి: ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌పై రీకాల్ పిటిషన్ వేస్తే ఎలా ఉంటుందనే విషయమై ఆలోచించాలని మంత్రులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సూచించారు. అయితే కోర్టుకు హాజరుఅవుదామని బాబు అభిప్రాయపడ్డారు.

ధర్మాబాద్ కోర్టు నుండి నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ కావడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంత్రులు, పార్టీ సీనియర్లు, అధికారులతో అమరావతిలో చర్చించారు. 

2010 బాబ్లీ ప్రాజెక్టు కేసులో పోరాటం చేసినందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా అప్పటి టీడీపీ నేతలు 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పై ఏం చేయాలనే దానిపై చంద్రబాబునాయుడు మంత్రులు, అధికారులు, పార్టీ సీనియర్లతో సోమవారం నాడు అమరావతిలో చర్చించారు.

గతంలో ధర్మాబాద్ కోర్టు నుండి వారంట్లు వచ్చాయా అనే విషయమై కూడ బాబు ఆరా తీశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు కానీ, వారంట్లు కూడ జారీ కాలేదని అధికారులు బాబు దృష్టికి తెచ్చారు.

ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసినందున కోర్టుకు హాజరౌదామని బాబు చెప్పారు. అయితే ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తర్వాత కోర్టుకు హాజరయ్యే విషయాన్ని ఆలోచిద్దామని కొందరు మంత్రులు బాబు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే రీకాల్ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉండదని బాబుకు కొందరు నేతలు సూచించారు. అయితే ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అనే విషయమై మంగళవారం నాడు మరోసారి చర్చించిన తర్వాత ఈ విషయమై తుది నిర్ణయం తీసుకొందామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

ఈ వార్తలు చదవండి

నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు

అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ
'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు