ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో బాబ్లీ కేసులో అనుసరించాల్సిన వ్యూహాలపై వాడీ వేడి చర్చ జరిగింది. ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాలా వద్దా అనే అంశంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో బాబ్లీ కేసులో అనుసరించాల్సిన వ్యూహాలపై వాడీ వేడి చర్చ జరిగింది. ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాలా వద్దా అనే అంశంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. 

అయితే ధర్మాబాద్ కోర్టుకు ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్తే బాగుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడుకు సూచించారు. అలాగే వారెంట్ రీకాల్ వంటి అంశాలపై మంత్రి యనమల రామకృష్ణుడు ఆరా తీశారు. అయితే అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ధర్మాబాద్ కోర్టు వారెంట్ పై శనివారం సీనియర్ మంత్రులు, అడ్వకేట్ జనరల్,న్యాయ నిపుణులతో సమావేశం కానున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సమావేశంలో ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాలా, వారెంట్ రీకాల్ వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.