Asianet News TeluguAsianet News Telugu

'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 24వ తేదీన ఐక్యరాజ్యసమితిలో జరిగే  ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్.. గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై ప్రసంగించాల్సి ఉంది

TTdp leaders slams on kcr and modi
Author
Hyderabad, First Published Sep 14, 2018, 1:03 PM IST

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 24వ తేదీన ఐక్యరాజ్యసమితిలో జరిగే  ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్.. గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై ప్రసంగించాల్సి ఉంది.  అయితే ఈ తరుణంలోనే ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్  జారీ చేయడం పెద్ద కుట్ర అని టీ.టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు.

బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సమయంలో 2010 లో  అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర విపక్ష నేత, ఇప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా మరో 16 మంది అప్పటి టీడీపీ నేతలకు నాన్ బెయిలబుల్ వారంట్‌ను ధర్మాబాద్ కోర్టు  జారీ చేసింది.

ఈ వారంట్ జారీ చేయడంపై టీటీడీపీ నేతలు  ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఎన్డీఏ నుండి  బయటికి వచ్చిన తర్వాత  ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసును తిరగదోడారని టీటీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బాబ్లీ నుండి తమను ఆంధ్రప్రదేశ్ కు తిప్పిపంపించే సమయంలో ఎలాంటి కేసులు లేవని అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని టీటీడీపీ నేతలు గుర్తు చేసుకొన్నారు. 

ఐక్యరాజ్యసమితిలో ఈ నెల 24వ తేదీన చంద్రబాబునాయుడు ‘‘ ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్.. గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ ప్రసంగించాల్సి ఉంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి  నుండి బాబుకు ఆహ్వానం అందింది.

అయితే ఈ ఆహ్వానాన్ని పురస్కరించుకొని చంద్రబాబునాయుడు అమెరికా టూర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే సెప్టెంబర్ 21వ తేదీన అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని ధర్మాబాద్ కోర్టు వారంట్ చేయడంపై ఆంతర్యమేమిటని టీటీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఎలాంటి నోటీసులు, సమన్లు జారీ చేయకుండానే  వారంట్లు జారీ చేయడంపై  టీడీపీ నేతలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్  తమకు వ్యతిరేకులపై కేసులను పెట్టి వేధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నేత పెద్దిరెడ్డి ఆరోపించారు.

8 ఏళ్లు, పదేళ్ల క్రితం కేసులను ఈ రెండు ప్రభుత్వాలు  కేసులను తిరగదోడడాన్ని చూస్తే ఈ రెండు పార్టీలకు  భయం పట్టుకొందన్నారు.  మరోవైపు కోర్టులపై తమకు గౌరవం ఉందని  టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ విషయమై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఈ వార్తలు చదవండి

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే..

శ్రీవారి సేవలో ఉండగా చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

Follow Us:
Download App:
  • android
  • ios