Asianet News TeluguAsianet News Telugu

బాబ్లీకేసు: రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని బాబు నిర్ణయం

ధర్మాబాద్ కోర్టు పంపిన నాన్ బెయిలబుల్ వారంట్‌పై న్యాయవాదిని పంపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. 

Chandrababu Naidu decides to file recall petition on babli case
Author
Amaravathi, First Published Sep 19, 2018, 1:32 PM IST


అమరావతి: ధర్మాబాద్ కోర్టు పంపిన నాన్ బెయిలబుల్ వారంట్‌పై న్యాయవాదిని పంపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాదు రీకాల్ పిటిషన్ కూడ వేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

బాబ్లీప్రాజెక్టు పోరాటం విషయంలో ధర్మాబాద్ కోర్టు వారం రోజుల క్రితం చంద్రబాబునాయుడు సహా మరో 16 మందికి నాన్ బెయిలబుల్  వారంట్ జారీ చేసింది.

2010 జూలై 16వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర విపక్ష నేత చంద్రబాబునాయుడు, పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు  మహారాష్ట్ర, ఏపీ సరిహద్దులోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శనకు వెళ్లారు.

ఆ సమయంలో చంద్రబాబునాయుడు సహా టిడిపి ప్రజాప్రతినిధులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల తర్వాత వదిలేశారు. అయితే  కేసులు పెట్టలేదని  ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని.. ఇప్పుడేమో కేసులు పెట్టినట్టు  నోటీసులు పంపిస్తోందని  టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

బాబ్లీ కేసు విషయమై విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కల్గించారనే కారణంగా చంద్రబాబునాయుడు సహా మరో 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ వారంట్‌పై  తన తరుపున లాయర్ ను పంపాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాదు ఈ విషయమై రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని కూడ బాబు నిర్ణయం తీసుకొన్నారు.

రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడు మంత్రులు, పార్టీ సీనియర్లతో పాటు అధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత ఇవాళ ఈనిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ నెల 21వ తేదీన కోర్టు ముందు బాబు సహా ఇతర 16 మందిని హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఈ మేరకు రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఈ వార్తలు చదవండి

నాన్ బెయిలబుల్ వారంట్‌పై బాబు మల్లగుల్లాలు: ఏం చేద్దాం?

నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు

అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ
'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

 

Follow Us:
Download App:
  • android
  • ios