ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాయ్‌పూర్ నుండి విమానంలో అమరావతికి చేరుకోనున్నారు


అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాయ్‌పూర్ నుండి విమానంలో అమరావతికి చేరుకోనున్నారు.పెథాయ్ తుఫాన్ పరిస్థితిపై చంద్రబాబునాయుడు మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు వెళ్లారు.ఏపీలో పెథాయ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల్లో ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబునాయుడు రాయ్‌పూర్ మీదుగా అమరావతికి చేరుకొంటారు.అమరావతికి చేరుకోగానే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది.

రాజమండ్రి లేదా విశాఖ జిల్లాల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో అధికారులు ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

తీరం దాటిన పెథాయ్ తుఫాన్.. తూర్పుగోదావరిలో బీభత్సం

పెథాయ్ తుఫాన్: సముద్రంలో అల్లకల్లోలం

ఏపీలో ‘‘పెథాయ్’’ విలయ తాండవం

పెథాయ్ తుఫాన్: తెలంగాణ‌పై ఎఫెక్ట్

పెథాయ్‌ తుఫాన్: అధికారులను అలెర్ట్ చేసిన బాబు

దిశ మార్చుకొంటున్న పెథాయ్: భారీ వర్షాలు

ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్

తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?

‘‘పెథాయ్’’ బీభత్సం: ఏపీలో రైళ్ల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు