అమరావతి: ఈ ఏడాది పెథాయ్ తుఫాన్ ‌తో మూడో తుఫాన్ అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తుఫాన్లు ఏపీ రాష్ట్రానికి పరిపాటేనని ఆయన గుర్తు చేశారు.అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.

పెథాయ్ తుఫాన్ పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో ఆదివారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రతి ఏటా ఏపీ రాష్ట్రానికి  తుఫాన్లు పరిపాటిగా మారిందని చంద్రబాబునాయుడు చెప్పారు. తుఫాన్లను ఎదుర్కోవడంలోనే  అనేక సవాళ్లు ఉన్నాయన్నారు.ఈ ఏడాది ఇది మూడో తుఫాన్ అని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.తిత్లీ, గజ, ఇప్పుడు పెథాన్  తుఫాన్ అని బాబు ప్రస్తావించారు.

తిత్లీతో రెండు రోజుల పాటు ఇబ్బందిపడినట్టు చెప్పారు. గతంలో చోటు చేసుకొన్న లోపాలను పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.తిత్లీతో కొబ్బరి చెట్లు కూలి తీవ్ర నష్టం చోటు చేసుకొందని బాబు చెప్పారు.

తిత్లీ కారణంగా వేలాది విద్యుత్ స్థంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు  ఇబ్బంది ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఈ దఫా ఆ రకమైన పరిస్థితులు ఎదురుకాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

విపత్తు నిర్వహణలో అప్రమత్తతే అవసరమని  బాబు అభిప్రాయపడ్డారు. సకాలంలో విద్యుత్ పునరుద్దరణ జరగాల్సిన అవసరం ఉందని బాబు తెలిపారు.
రహదారులకు గండ్లను వెంటనే పూడ్చాలని  బాబు ఆదేశించారు. విద్యుత్ స్థంబాలు ఎన్ని కావాలి, ఎక్కడి నుండి తెచ్చుకోవాలనే విషయమై ముందే ప్లాన్ చేసుకోవాలన్నారు.తాగునీటి సమస్య లేకుండా, ఆహార ప్కాకెట్లను సిద్దం చేసుకోవాలని బాబు సూచించారు. 

సంబంధిత వార్తలు

దిశ మార్చుకొంటున్న పెథాయ్: భారీ వర్షాలు

ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్