విశాఖపట్టణం: పెథాయ్ తుఫాన్ క్షణ క్షణానికి గమ్యాన్ని మార్చుకొంటుంది. ఎటు పయమనిస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది 24 గంటల్లోపుగా పెథాయ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని  వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకినాడ వద్ద పెథాయ్ తీరం దాటే అవకాశం ఉందని  వాతావారణ శాఖాధికారులు చెబుతున్నారు.  దీని ప్రభావంతో సుమారు 20 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పెథాయ్ తుఫాన్ ఎక్కడ తీరం దాటుతోందోననే విషయమై స్పష్టత రావాల్సి ఉందని వాతావరణ నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు. కాకినాడ, ఒడిశాలలో ఏ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందో  ఇప్పటికిప్పుడే చెప్పలేమంటున్నారు.

క్షణ క్షణానికి తుఫాన్  తన గమ్యాన్ని మార్చుకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో  తీరం దాటే ప్రాంతాన్ని ఖచ్చితంగా చెప్పలేక పోతున్నట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాకినాడ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని  అధికారులు చెబుతున్నారు.

తుపాన్ తీరం దాటే సమయంలో  తీర ప్రాంతంలో  ఉప్పెనలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్రంలో సుమారు 6 మీటర్లకు పైగా  ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి.

పెథాయ్ తుఫాన్ తీరం దాటే సమయంలో సుమారు 20 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారీ వర్షాలు కురిసే అవకాశాలు నెలకొన్నందున  లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటివరకు వాతావరణ అధికారుల అంచనా మేరకు విశాఖ- కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. 

తుఫాన్ తీరం దాటే సమయంలో 70 కి.మీలకు  పైగా గాలులు వీచే అవకాశం ఉంది.ఈ తుపాన్ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లాలోని 13 మండలాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

తుఫాన్  క్షణ క్షణానికి దిశ మార్చుకొంటుందని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజల కోసం సుమారు 200 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్